Vitthal Temple: విఠల్‌ ఆలయంలో ద్రాక్షపండ్లతో అందంగా అలంకరణ.. అరగంటకే టన్ను ద్రాక్ష పండ్లు మాయం..

|

Mar 04, 2023 | 9:28 AM

అమలకి ఏకాదశి సందర్భంగా విఠల్-రుక్మిణి ఆలయాన్ని పూణేకు చెందిన భక్తులు సచిన్ చవాన్ మరియు బారామతికి చెందిన బాలాసాహెబ్ షిండే రకరకాల ద్రాక్ష గుత్తులతో అలంకరించారు. దాదాపు ఒక టన్ను ద్రాక్షను ఉపయోగించారు. ఉదయం ఆరు గంటలకు అలంకరణ పూర్తయింది

Vitthal Temple: విఠల్‌ ఆలయంలో ద్రాక్షపండ్లతో అందంగా అలంకరణ.. అరగంటకే టన్ను ద్రాక్ష పండ్లు మాయం..
Vitthal Rukmini Temple
Follow us on

మహారాష్ట్రలోని పండరి పురంలోని ప్రముఖ దేవాలయం విఠల్ రుక్మిణి ఆలయం. ఈ ఆలయంలో శుక్రవారం రోజున అద్భుతం జరిగింది. ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే అమలక ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని పూలతో, ద్రాక్షతో అందంగా  అలంకరించారు. విఠల్-రుక్మిణి ఆలయ గర్భగుడి దాదాపు ఒక టన్ను ద్రాక్ష గుత్తులతో అలంకరించారు. ఇలా ద్రాక్ష గుత్తులతో అందంగా అలంకరించడం కోసం శ్రమ పడినంత సేపు లేదు.. అలంకారం చేసిన అరగంటలోనే ద్రాక్షపళ్లన్నీ మాయమయ్యాయి. విఠలుడి అలంకరణ అనంతరం దర్శనం ప్రారంభించి అరగంటలో టన్ను ద్రాక్షలు మాయమయ్యాయి. చూడడానికి ఒక్క ద్రాక్ష కూడా మిగలలేదు. అదేంటి భారీ మొత్తంలో ద్రాక్ష ఎక్కడికి పోయింది అని ఆలోచిస్తున్నారా..  మొత్తం స్టాక్ ఎక్కడికి పోయిందో అని ఆలోచిస్తున్నారా..

ఆలయంలో అందంగా అలంకరించిన ద్రాక్ష పండ్లను దేవుడికి దర్శనం కోసం వచ్చిన భక్తులు తమ వెంట తీసుకెళ్లారని ఆలయ కమిటీ సిబ్బంది చెబుతోంది. అయితే భక్తులు నిజంగా ఈ ద్రాక్ష పండ్లను తీసుకున్నారా లేక మరెవరైనా తీసుకున్నారా? అనే విషయంపై  చర్చ మొదలైంది. ఎందుకంటే.. భక్తులకు ప్రవేశం లేని చోట.. ద్రాక్ష పండ్లను అలంకరణకు వినియోగించారు. దీంతో ఈ ద్రాక్ష పండ్లు ఎలా మాయమయ్యాయన్న ప్రశ్న తలెత్తుతోంది.

కేవలం అరగంటలో ఒక టన్ను ద్రాక్ష మాయం
అమలకి ఏకాదశి సందర్భంగా విఠల్-రుక్మిణి ఆలయాన్ని పూణేకు చెందిన భక్తులు సచిన్ చవాన్ మరియు బారామతికి చెందిన బాలాసాహెబ్ షిండే రకరకాల ద్రాక్ష గుత్తులతో అలంకరించారు. దాదాపు ఒక టన్ను ద్రాక్షను ఉపయోగించారు. ఉదయం ఆరు గంటలకు అలంకరణ పూర్తయింది. అనంతరం దేవుడి దర్శనం ప్రారంభించారు. భక్తులు విఠలుడి దర్శనం మొదలైన అరగంటలోనే చూడడానికి కనీసం ఒక్క ద్రాక్ష పండు కూడా లేకుండా మాయమైపోయాయి.

ఇవి కూడా చదవండి

ఈ ద్రాక్షను ప్రసాదంగా పంపిణీ .. 
దర్శనానికి వచ్చిన భక్తులను అలంకరించిన ద్రాక్ష పండ్లను కొద్దికొద్దిగా తీసుకెళ్లారని ఆలయ కమిటీ సిబ్బంది తెలిపారు. అయితే ఆలయ సిబ్బంది చేతి వాటం చూపించడంతో అలంకరించిన ద్రాక్ష మాయమైందని భక్తులు ఆరోపిస్తున్నారు. విఠలుడి ఆలయంలో పండగలు పర్వదినాల సమయంలో, ఏకాదశి రోజున ఆలయాన్ని వివిధ రకాలుగా అలంకరిస్తారు. ఈ అందమైన అలంకరణను భక్తులు చూసేందుకు రోజంతా ఉంచుతారు. ఆ తర్వాత ద్రాక్షను భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తారు. అయితే ఇప్పుడు అలంకరించిన అరగంటకే ద్రాక్ష పండ్లు మాయమైపోవడంతో ఈ విషయంపై విచారణ జరపాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..