Hanuman Chalisa: జైలులో పుట్టిన మహామహిమానిత్వమైన హనుమాన్ చాలీసా.. తులసీదాస్ ఎలా రాశాడో ఆసక్తికరమైన కథ

|

Jun 07, 2022 | 8:37 AM

Hanuman Chalisa: హనుమాన్ చాలీసాను  తులసీదాస్ రచించారని మనందరికీ తెలుసు. అయితే ఆయన ఏ పరిస్థితుల్లో హనుమాన్ చాలీసా రాశారో చాలా మందికి తెలియదు. హనుమాన్ చాలీసా సృష్టికి సంబంధించిన ఆసక్తికరమైన వృత్తాంతం గురించి తెలుసుకుందాం.. 

Hanuman Chalisa: జైలులో పుట్టిన మహామహిమానిత్వమైన హనుమాన్ చాలీసా.. తులసీదాస్ ఎలా రాశాడో ఆసక్తికరమైన కథ
Hanuman Chalisa
Follow us on

Hanuman Chalisa: రామ భక్తుడు హనుమంతుడిని సంకట మోచనుడు అని కూడా అంటారు. ఎవరైనా హనుమంతుడిని  హృదయపూర్వకంగా పూజిస్తే.. అతని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. హనుమాన్ చాలీసాలో చాలా శక్తి ఉంది. ఎవరైనా క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసాను హృదయపూర్వకంగా చదివితే.. ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి.   దెయ్యం, పిశాచాల నీడ కూడా పడదు. పితృదోషం, మంగళదోషం మొదలైన వాటి నుంచి విముక్తి పొందింది. హనుమాన్ చాలీసా హనుమంతుడి సామర్థ్యాన్ని, రాముని పట్ల భక్తి ని, నమ్మకాన్ని తెలియజేస్తుంది. అయితే ఈ హనుమాన్ చాలీసాను  తులసీదాస్ రచించారని మనందరికీ తెలుసు. అయితే ఆయన ఏ పరిస్థితుల్లో హనుమాన్ చాలీసా రాశారో చాలా మందికి తెలియదు. హనుమాన్ చాలీసా సృష్టికి సంబంధించిన ఆసక్తికరమైన వృత్తాంతం గురించి తెలుసుకుందాం..

జైలులో రాయబడిన చాలీసా: 
అక్బర్ జైలులో తులసీదాస్ హనుమాన్ చాలీసాను రచించాడని చెబుతారు. తులసీదాస్ శ్రీ రామచరితమానస్ రచించినప్పుడు.. అతని కీర్తి సర్వవ్యాప్తమైంది. అంతేకాదు తులసీదాసు కీర్తి, రామచరితమానస్ పట్ల ప్రజల గౌరవాన్ని చూసిన అక్బర్ తన సైనికులను పంపి తులసీదాస్‌ను తన ఆస్థానానికి పిలిపించుకున్నాడు. తులసీదాస్ .. ఆస్థానికి చేరుకున్న తర్వాత అబ్దుల్ రహీం ఖాన్-ఎ-ఖానా, తోడర్ మల్ అక్బర్‌ను ప్రశంసిస్తూ కూడా ఒక పుస్తకం రాయమని చెప్పారు. అయితే తులసీదాస్ .. అక్బర్ గురించి పుస్తకాన్ని రాయడాన్ని నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తుడైన అక్బర్ అతడిని జైలులో పెట్టాడు. తులసీదాస్‌ జైల్లో ఉన్నప్పుడు హనుమంతుడిని కీర్తిస్తూ.. చాలీసా ను రచించాడు ఓ కథనం.

చాలీసా మహిమను చూసి ఆశ్చర్యపోయిన అక్బర్ : 
ఒకరోజు అక్బర్ జైలు నుండి తులసీదాస్‌ని తన ఆస్థానానికి పిలిచి.. మీ శ్రీరాముడిని పరిచయం చేయండి. నేను కూడా అతని అద్భుతాన్ని చూడాలనుకుంటున్నానని అడిగాడట. అప్పుడు తులసీదాసు మా శ్రీరాముడు అలా ఎవరితోనూ కలవడు..  ఆయనను కలవాలంటే మనసులో విశ్వాసం, భక్తి ఉండాలని సమాధానము చెప్పాడు తులసీదాస్ సమాధానం విన్న అక్బర్ మళ్లీ కోపోద్రిక్తుడై తులసీదాస్‌ను మళ్లీ జైలులో పెట్టమని ఆదేశించాడు. అప్పుడు తులసీదాస్ అక్బర్ ఆస్థానంలో హనుమాన్ జీ చాలీసా చదవడం ప్రారంభించాడు. చాలీసా పారాయణం ప్రారంభించిన వెంటనే, ఫతేపూర్ సిక్రీ కోర్టు , జైలు దగ్గర చాలా కోతులు గుమిగూడి హంగామా చేయడం ప్రారంభించాయి. ఇది చూసి అక్బర్ కూడా ఆశ్చర్యపోయాడు. దీని తరువాత అతని సలహాదారులు తులసీదాస్‌ను విడిపించమని అక్బర్‌ను కోరారు.  అప్పుడు అక్బర్ తులసీదాస్ ని జైలు నుంచి విడుదల చేయవలసి వచ్చిందట. అదే హనుమాన్‌ చాలీసాగా జగత్ప్రసిద్ధి పొందింది.  “చాలీసా” అనే పదం “చాలీస్” అనే పదం నుండి వ్యుత్పత్తి అయింది. హిందీ భాషలో చాలీస్ అంటే తెలుగులో నలభై అని అర్ధం. హనూమన్ చాలీసాలో నలభై శ్లోకాలు ద్విపదులుగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..