Horoscope Today: మంగళవారం రాశిఫలాలు… నేడు ఈ రాశి వ్యాపారస్తులకు ధన లాభం కలిగే అవకాశం ఉంది..
రోజులో తమకు ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలని ఆసక్తిని చూపిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 7వ తేదీ) మంగళ వారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
Horoscope Today (07-06-2022): రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా , ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా రోజులో తమకు ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలని ఆసక్తిని చూపిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 7వ తేదీ) మంగళ వారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
- మేష రాశి: ఈరోజు ఈ రాశివారు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం మేలు, ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆయా రంగాల్లోని వారు చేపట్టిన పనులు తగిన జాగ్రత్తలతో పూర్తి చేయాల్సి ఉంటుంది.
- వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు కొత్త పనులను ప్రారంభిస్తారు. బంధువుల విషయంతో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలు. కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
- మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు కీలక విషయాలను వాయిదా వేసుకోవడం వలన మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవరాల విషయంలో దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు.
- కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు తోటివారి సహాయ సహకారాలతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. బంధువులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. స్థిరమైన నిర్ణయాలతో అనుకూల ఫలితాలను సాధిస్తారు.
- సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ఇష్టమైన వ్యక్తులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన విషయాల పట్ల తగిన జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. చేపట్టిన పనులు ఫలిస్తాయి.
- కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతోషముగా గడుపుతారు. చేపట్టిన పనులను శ్రద్ధతో పూర్తి చేయాల్సి ఉంటుంది.మానసికంగా సుఖ సంతోషంగా ఉంటారు.
- తుల రాశి: ఈ రోజు ఈ రాశి వారు శ్రమకు తగిన గుర్తింపుని సొంతం చేసుకుంటారు. ముఖ్యమైన పనుల విషయంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది.
- వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు కీలక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా తగిన ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉంది.
- ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు అధికారులపై ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఆర్ధికంగా లాభాలు సొంతమవుతాయి. కొత్తవారితో స్నేహం చేస్తారు.
- మకర రాశి: ఈరోజు ఈ రాశివారు కలహాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇతరుల సహాయసహకారాలతో శుభఫలితాలను సొంతం చేసుకుంటారు. కీలక విషయాలలో ముందుచూపుతో వ్యవహరించాలి.
- కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు శుభవార్తలు వింటారు. కీలక వ్యవహారాల్లో ప్రతిభకు తగిన గుర్తింపు సొంతం చేసుకుంటారు. అందరి ప్రశంసలను అందుకుంటారు.
- మీన రాశి: ఈరోజు ఈ రాశివారు మానసిక ధైర్యంతో పనులు చేపట్టాల్సి ఉంటుంది. విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఇష్టమైన వారితో గడుపుతారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)