AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tulasi Plant: తులసి మొక్కకు ఆ రోజుల్లో కూడా నీరు పోస్తున్నారా.. అయితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..

Tulasi Plant: సనాతన హిందూ ధర్మలో తులసి మొక్కని చాలా పవిత్రంగా భావిస్తారు. తులసిని పూజిస్తారు. తులసి ఉన్న ఇంట్లో లక్ష్మి నివసిస్తుందని నమ్ముతారు. ఆ ఇంట్లో విష్ణుమూర్తి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం ఇస్తుంది. వాస్తు శాస్త్రంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇంట్లో తులసి మొక్కను […]

Tulasi Plant: తులసి మొక్కకు ఆ రోజుల్లో కూడా నీరు పోస్తున్నారా.. అయితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..
Tulasi Plant
Surya Kala
|

Updated on: Jun 07, 2022 | 9:55 AM

Share

Tulasi Plant: సనాతన హిందూ ధర్మలో తులసి మొక్కని చాలా పవిత్రంగా భావిస్తారు. తులసిని పూజిస్తారు. తులసి ఉన్న ఇంట్లో లక్ష్మి నివసిస్తుందని నమ్ముతారు. ఆ ఇంట్లో విష్ణుమూర్తి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం ఇస్తుంది. వాస్తు శాస్త్రంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇంట్లో తులసి మొక్కను నాటడం.. నీటిని క్రమం తప్పకుండా తులసి మొక్కకు పోయడం సర్వసాధారణంగా ఎవరైనా చేసేదే.. అయితే తులసి మొక్కకు నీరు అన్ని రోజులు పోయకూడదు.. ముఖ్యంగా ఆదివారం,ఏకాదశి రోజున తులసికి నీరు పోయకూడదు.   అయితే ఈ రోజుల్లో తులసికి ఎందుకు నీరు పోయకూడదో ఈరోజు తెలుసుకుందాం.

ఆదివారం తులసికి నీళ్లు ఎందుకు ఇవ్వరంటే..  తులసికి రోజూ నీళ్లు పోయడం చాలా మంచిది. అయితే ఆదివారం రోజు అందుకు మినహాయింపు. ఆదివారం రోజున  తులసి మహావిష్ణువు కోసం ఉపవాసం ఉంటుందని నమ్మకం. అయితే తులసిలో నీరు పెట్టడం వల్ల ఉపవాసం విరమించినట్లు అవుతుంది కనుక తులసి మొక్కకు ఆదివారం నీరు పోయడం వలన ప్రతికూలత ఏర్పడుతుంది. అంతేకాదు జీవితానికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

తులసి ఏకాదశి నాడు ఎందుకు నీరు పెట్టకూడదంటే..  తులసి దేవి ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన శాలిగ్రామ్‌తో వివాహం జరిగిందని నమ్మకం. హిందూ సంప్రదాయం  ప్రకారం లక్ష్మీదేవి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటుందని.. కనుక ఏకాదశి రోజున తులసికి నీటిని సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి ఉపవాసం భంగమవుతుంది. దీంతో లక్ష్మీదేవి తులసిపై కోపం వస్తుంది. దీని కారణంగా మొక్క ఎండిపోవడం ప్రారంభమవుతుందని పురాణాల కథనం.

ఇవి కూడా చదవండి

ఇంట్లో ఐశ్వర్యం కోసం తులసి మొక్కను ఏ విధంగా నాటాలంటే.. తులసి మొక్కను ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశలో నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

తులసి మొక్కకు తగినంత సూర్యకాంతి , గాలి అందేలా చూడాలి.

తులసి చుట్టూ ఉండే ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి

తులసి మొక్క దగ్గర చెత్తబుట్టలు, బూట్లు లేదా చీపుర్లు ఉంచవద్దు.

కాక్టస్ లేదా ముళ్ళ మొక్కల దగ్గర తులసి మొక్కను ఉంచవద్దు ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని, దురదృష్టాన్ని తెస్తుంది.

తులసి మొక్కను ఒకటి, మూడు, ఐదు మొదలైన బేసి సంఖ్యలో నాటండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఇచ్చింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Follow Us
10th కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్
10th కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..
నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..
క్రికెట్ వేలంలో కోహ్లీ మేనల్లుడి జోరు
క్రికెట్ వేలంలో కోహ్లీ మేనల్లుడి జోరు
నా సినిమా చూసి మహేష్ అన్న అర్ధరాత్రి కాల్ చేశారు..
నా సినిమా చూసి మహేష్ అన్న అర్ధరాత్రి కాల్ చేశారు..
ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా..? కానీ, ఈ ఒక్క పనిచేస్తే బిందాస్
ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా..? కానీ, ఈ ఒక్క పనిచేస్తే బిందాస్