గంగా దసరా రోజున గంగా స్నానం అత్యంత ఫలవంతం.. తేదీ, పూజా విధానం, శుభ సమయం ఎప్పుడంటే..

|

May 16, 2024 | 3:09 PM

గంగా దసరా రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేయడం వల్ల మనిషి తెలిసి తెలియక చేసిన అన్ని పాపాలు తొలగిపోతాయని, జీవితంలో సుఖ సంపదలు లభిస్తాయని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో గంగా దసరా పండుగను ఎప్పుడు జరుపుకుంటారు? పవిత్రమైన సమయం, పూజా విధానం ఏమిటో తెలుసుకుందాం..వేద క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసం శుక్ల పక్ష దశమి తిథి జూన్ 16 మధ్యాహ్నం 2:32 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ జూన్ 17 ఉదయం 4:45 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం గంగా దసరా జూన్ 16, 2024 ఆదివారం రోజున జరుపుకుంటారు.

గంగా దసరా రోజున గంగా స్నానం అత్యంత ఫలవంతం.. తేదీ, పూజా విధానం, శుభ సమయం ఎప్పుడంటే..
Ganga Dussehra 2024
Follow us on

హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున గంగా దసరా జరుపుకునే సంప్రదాయం ఉంది. ఈ రోజున గంగామాతను సంప్రదాయం ప్రకారం పూజిస్తారు. సనాతన ధర్మ మత విశ్వాసాల ప్రకారం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున గంగాదేవి భూమిపై ఉద్భవించింది. గంగా దసరా రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేయడం వల్ల మనిషి తెలిసి తెలియక చేసిన అన్ని పాపాలు తొలగిపోతాయని, జీవితంలో సుఖ సంపదలు లభిస్తాయని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో గంగా దసరా పండుగను ఎప్పుడు జరుపుకుంటారు? పవిత్రమైన సమయం, పూజా విధానం ఏమిటో తెలుసుకుందాం..

గంగా దసరా 2024 తేదీ
వేద క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసం శుక్ల పక్ష దశమి తిథి జూన్ 16 మధ్యాహ్నం 2:32 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ జూన్ 17 ఉదయం 4:45 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం గంగా దసరా జూన్ 16, 2024 ఆదివారం రోజున జరుపుకుంటారు.

గంగా దసరా 2024 ముహూర్తం
పంచాంగం ప్రకారం జూన్ 16 ఉదయం 11:13 గంటల వరకు గంగా దసరా రోజున హస్తా నక్షత్రంలో ఏర్పడుతోంది. దీనితో పాటు బ్రహ్మ ముహూర్తం పవిత్ర స్నానానికి ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. ఈ రోజు ఉదయం 4:03 నుండి 4:45 వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున రవియోగం, సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం కూడా ఏర్పడుతున్నాయి, ఇవి పూజకు, స్నానానికి, దానానికి అత్యంత ప్రీతికరమైన సమయంగా పరిగణించబడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

గంగా దసరా పూజ విధి
గంగా దసరా రోజున తెల్లవారుజామున నిద్రలేచి, స్నానం చేసి, పవిత్ర నది దగ్గర ధ్యానం చేయండి. నదిలో స్నానం చేయడం సాధ్యం కాకపోతే ఇంట్లో గంగాజలం కలిపిన నీటిని స్నానం చేయండి. దీని తరువాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి శుభ్రమైన బట్టలు ధరించి, ఆచారాల ప్రకారం గంగాదేవి, శివుడిని పూజించండి. దీని తరువాత పూజ సమయంలో గంగా స్తోత్రాన్ని పఠించి, చివరగా గంగాదేవికి హారతిని ఇచ్చి పూజను ముగించండి.

గంగా దసరా విశిష్టత
గంగా దసరా రోజున గంగాదేవిని పూజిస్తారు. అలాగే ఈ రోజున భక్తులు గంగా నదిలో భక్తీ విశ్వాసాలతో స్నానం చేస్తారు. మత విశ్వాసాల ప్రకారం.. శివుని జటాజూటం నుంచి గంగాదేవి భూమిపై అవతరించింది. అందుకే గంగా దసరా రోజున చేసే పూజలు, శుభకార్యాలు ఫలవంతం అని నమ్మకం.

గంగా దసరా రోజున గంగా నదిలో స్నానం చేయడం వల్ల తెలిసి, తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని చెబుతారు. గంగా దసరా రోజున మోక్ష ప్రదాత అయిన గంగామాతను పూజించి, పూర్వీకులకు నైవేద్యాన్ని సమర్పించడం ద్వారా పుత్ర సంతానం, కోరుకున్న కోరికలు తీరతాయని విశ్వాసం. ఈ పవిత్రమైన రోజున నీరు, ఆహారం, అలంకరణ వస్తువులు, చక్కెర, బట్టలు, పండ్లు, బంగారాన్ని దానం చేయడం చాలా శుభప్రదమని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు