మాఘ పౌర్ణమి: రవి పుష్య యోగం.. బంగారం, వెండి కొనేందుకు శుభ సమయం ఇదే.. లక్ష్మీ దేవి మీ ఇంటికే..!
Magha Purnima: ఈ ఏడాది మాఘ పౌర్ణమి తిథి ఫిబ్రవరి 1 ఆదివారంనాడు వస్తుంది. అత్యంత శుభప్రదమైన యోగాలలో ఒకటైన రవి పుష్య యోగం మాఘ పూర్ణిమ తిథినాడు ఏర్పడటం విశేషం. ఈ యోగం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో చేసే పని లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడం జీవితంలో పురోగతి లభిస్తుంది.

Ravi Pushya Yoga: ప్రతి సంవత్సరం మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఏడాది మాఘ పౌర్ణమి తిథి ఫిబ్రవరి 1 ఆదివారంనాడు వస్తుంది. అత్యంత శుభప్రదమైన యోగాలలో ఒకటైన రవి పుష్య యోగం మాఘ పూర్ణిమ తిథినాడు ఏర్పడటం విశేషం. ఈ యోగం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో చేసే పని లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడం జీవితంలో పురోగతి లభిస్తుంది. ఆదివారం పుష్య నక్షత్రం ఉండటం వల్ల రవి పుష్య యోగం ఏర్పడుతుంది. రవి పుష్య యోగం ఎప్పుడు, ఎంత సమయం ఉంటుందని విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా, రవి పుష్య యోగంలో ఏ పనులు చేస్తే లాభం ఉంటుందో తెలుసుకుందాం.
రవి పుష్య యోగం ఎప్పుడు?
ఫిబ్రవరి 1 మాఘ పూర్ణిమ తిథినాడు శుభ రవి పుష్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఉదయం 7.09 గంటలకు ప్రారంభమై రాత్రి 11.58 గంటల వరకు ఉంటుంది. ఇది బంగారం, వెండి కొనుగోలు లేదా శుభ కార్యకలాపాలకు శుభ సమయం. సర్వార్ధ సిద్ధి యోగం కూడా ఉదయం 7.09 నుంచి రాత్రి 11.58 గంటల వరకు అమలులో ఉంటుంది.
రవి పుష్య యోగ సమయంలో ఏం కొనడం శుభప్రదం?
రవి పుష్య యోగ సమయంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా శుభప్రదం. అలాంటి వ్యాపారాలు స్థిరమైన వృద్ధిని, ఆర్థిక లాభాలను అందుకుంటాయి. మీరు కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త పనిని ప్రారంభిస్తుంటే.. రవి పుష్య యోగం అత్యంత శుభప్రదమైన, ఉత్తమ సమయం. మీ పని అనుకూల ఫలితాలు ఇస్తుంది. కొత్త ఇల్లు, దుకాణం, ఫ్లాట్ లేదా కారు కొనడానికి రవి పుష్య యోగం ఉత్తమ సమయం. రవి పుష్య యోగ సమయంలో బంగారం, వెండి లేదా ఇతర ఆభరణాలను కొనుగోలు చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. దీంతో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది.
సూర్యుడి ఆశీస్సుల కోసం ఏం చేయాలి?
రవి పుష్య యోగ సమయంలో ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. సూర్య భగవానుడి పూజించి ఆయనకు నీరు(అర్ఘ్యం) అర్పించండి. నైవేద్య నీటిలో ఎర్ర చందనం, ఎర్ర పువ్వులు, కుంకుమ, బెల్లం వంటి పదార్థాలను జోడించడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. సూర్య భగవానుడి ఆశీర్వాదం, సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం, పిల్లల ఆనందం పొందేందుకు సూర్య మంత్రాన్ని జపించాలి.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)
