Dussehra 2024: దసరా రోజున ఈ పరిహారాలు చేసి చూడండి, జీవితంలో డబ్బుకు లోటు ఉండదు..

ఈ ఏడాది దసరా శనివారం 12 అక్టోబర్ 2024న జరుపుకోనున్నారు. ఈ రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించినట్లు చెబుతారు. అంతేకాదు ఈ రోజున శ్రీ రాముడు లంకాధీసుడు రావణుడిని సంహరించి రావణుని చెర నుండి సీతాదేవిని విడిపించాడు. ఈ రోజున శుభకార్యాలు, వాహనాలు, వస్తువులు కొనుగోలు చేయడం మంచిదని భావిస్తారు.

Dussehra 2024: దసరా రోజున ఈ పరిహారాలు చేసి చూడండి, జీవితంలో డబ్బుకు లోటు ఉండదు..
Dussehra 2024
Follow us
Surya Kala

|

Updated on: Oct 07, 2024 | 7:42 AM

ఈ ఏడాది దసరా శనివారం 12 అక్టోబర్ 2024న జరుపుకోనున్నారు. ఈ రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించినట్లు చెబుతారు. అంతేకాదు ఈ రోజున శ్రీ రాముడు లంకాధీసుడు రావణుడిని సంహరించి రావణుని చెర నుండి సీతాదేవిని విడిపించాడు. ఈ రోజున శుభకార్యాలు, వాహనాలు, వస్తువులు కొనుగోలు చేయడం మంచిదని భావిస్తారు. అంతేకాదు ఈ రోజున చేసే కొన్ని ఖచ్చితమైన చర్యలు ఎల్లప్పుడూ జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తాయి.

దసరా రోజున చేయాల్సిన నివారణలు

దసరా రోజున జమ్మి వృక్షానికి సంబంధించిన పరిహారాలు చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. నవమి రోజు రాత్రి జమ్మి చెట్టు లేదా మొక్క కింద దీపం వెలిగించడం ద్వారా, వ్యక్తి న్యాయపరమైన విషయాల నుంచి ఉపశమనం పొందుతాడు. అంతేకాదు అదృష్టం లభిస్తుందని నమ్మకం.

పేదరికాన్ని తొలగించే మార్గాలు

దసరా రోజున చీపురు దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. దసరా రోజు సాయంత్రం లక్ష్మీ దేవిని పూజించండి. సమీపంలోని ఆలయానికి చీపురు దానం చేయండి. అంతే కాకుండా అపరాజిత పువ్వు అంటే శంఖం పువ్వుతో పూజించడం కూడా చాలా శుభప్రదం. ఇలా చేయడం వల్ల మనిషి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని, శత్రువుల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం.

ఇవి కూడా చదవండి

కెరీర్‌లో పురోగతికి మార్గాలు

వృత్తి, వ్యాపారంలో పురోగతిని పొందడానికి దసరా రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సుందరకాండ పఠించడం శుభప్రదం. ఈరోజు సుందరకాండను పఠించడం ద్వారా జీవితంలో వచ్చే ప్రతి చెడును నివారిస్తుంది. అభివృద్ధి పురోగతిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.

సంపద, శ్రేయస్సు కోసం చిట్కాలు

దసరా అంటే విజయ దశమి రోజున నీలకంఠ పక్షిని అంటే పాల పిట్ట దర్శనం చాలా శుభప్రదంగా భావిస్తారు. దసరా రోజున ఈ పక్షిని చూస్తే ఐశ్వర్యం పెరుగుతుందని, జీవితంలో ఆనందం కలుగుతుందని నమ్మకం.

విజయం సాధించడానికి మార్గాలు

ఎంత కాలం కష్టపడినా విజయం దక్కకపోతే దసరా రోజున పీచుతో ఉన్న కొబ్బరిని పసుపు గుడ్డలో చుట్టండి. పవిత్రమైన దారం, స్వీట్లతో పాటు రామాలయంలో ఉంచండి. ఇలా చేయడం ద్వారా ప్రగతి దారులు తెరుచుకోవడం ప్రారంభమవుతుందని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!