Navaratri 2024: నేడు నవరాత్రి ఐదవ రోజు, సంతాన సుఖం కోసం స్కందమాతని ఇలా పూజించండి.. శుభ సమయం ఎప్పుడంటే
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. నేడు నవరాత్రులలో ఐదవ రోజు. అశ్విని మాసంలో శుక్ల పక్షంలోని పంచమి రోజున దుర్గా దేవి స్కందమాత అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అదే సమయంలో విజయవాడలోని కనక దుర్గాదేవి శ్రీ మహా చండీ దేవి రూపంలో దర్శనం ఇస్తుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు రోజు స్కందమాత, చండీ పూజను జరుపుకోనున్నారు. స్కందమాత దేవిని పూజించడం వల్ల సంతాన సుఖం లభిస్తుందని నమ్ముతారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. నేడు నవరాత్రులలో ఐదవ రోజు. అశ్విని మాసంలో శుక్ల పక్షంలోని పంచమి రోజున దుర్గా దేవి స్కందమాత అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అదే సమయంలో విజయవాడలోని కనక దుర్గాదేవి శ్రీ మహా చండీ దేవి రూపంలో దర్శనం ఇస్తుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు రోజు స్కందమాత, చండీ పూజను జరుపుకోనున్నారు. స్కందమాత దేవిని పూజించడం వల్ల సంతాన సుఖం లభిస్తుందని నమ్ముతారు. నవరాత్రి ఐదవ రోజున స్కంద మాత పూజా విధానం, నైవేద్యం, హారతి, మంత్ర పఠనం గురించి తెలుసుకుందాం.
శారదీయ నవరాతరులలో భక్తులు దుర్గాదేవి ఆరాధనలో నిమగ్నమై ఉన్నారు. నవరాత్రులలో ప్రతిరోజు దుర్గాదేవి అవతారాలను నవ దుర్గ రూపాలను పూజిస్తారు. నవరాత్రులలో ఐదవ రోజు స్కందమాతకు అంకితం చేయబడింది. స్కంద అంటే కార్తీకేయుడు. కార్తీకేయుని తల్లి కావడంతో ఈ స్వరూపానికి స్కంద మాత అనే పేరు వచ్చింది. కాశీ ఖండం, దేవీ పురాణం.. స్కంద పురాణాలలో అమ్మవారి రూపం గురించి ప్రస్తావించబడింది. స్కందమాతకు నాలుగు చేతులు ఉంటాయి. తన రెండు చేతులలో తామరపువ్వును పట్టుకుని కనిపిస్తుంది. ఒక చేత్తో బాలుడు కూర్చొని ఉంటాడు. త మరో చేత్తో బాణం పట్టుకుని దర్శనం ఇస్తుంది. స్కందమాత పద్మాసనంపై కూర్చుంది. అందుకే ఆమెను పద్మాసనా దేవి అని కూడా అంటారు. స్కందమాత వాహనం సింహం. సింహంపై స్వారీ చేస్తున్న దుర్గామాత తన ఐదవ రూపంలో స్కందమాత భక్తులకు కల్యాణాన్ని అందిస్తుంది.
స్కందమాత పూజా శుభ సమయం
వేద పంచాంగం ప్రకారం స్కందమాత దేవిని పూజించడానికి ఉదయం 11:40 నుండి 12:30 వరకు అనుకూలమైన సమయం ఉంది.
స్కందమాత పూజా విధానం
నవరాత్రి ఐదవ రోజున ముందుగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. తరువాత ఇంటి పూజా గదిలో లేదా అమ్మవారిని ప్రతిష్టించిన స్థలంలో పీఠంపై స్కందమాత చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్టించండి. గంగాజలంతో శుద్ధి చేసి, ఒక కలశంలో నీటిని తీసుకుని, అందులో కొన్ని నాణేలు వేసి పీఠంపై ఉంచండి. అనంతరం పూజ చేయడానికి తీర్మానం చేయండి. దీని తరువాత పసుపు, కుంకుమ అమ్మవారికి పెట్టండి. స్కందమాతకు నైవేద్యాన్ని సమర్పించండి. ఇప్పుడు ధూపం, దీపంతో అమ్మవారికి హారతి ఇస్తూ మంత్రాన్ని జపించండి. స్కంద మాతకు తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. కావున భక్తులు తెల్లని వస్త్రాలు ధరించి పూజించండి. అమ్మవారికి అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా తల్లి అనుగ్రహిస్తుందని నమ్ముతారు.
స్కందమాత పూజ మంత్రం
సింహసంగత నిత్యం పద్మశ్రీ తకర్డ్వయా । శుభమస్తు దేవీ స్కందమాతా యశ్వినీ ||
ఓం స్కంద మాతాయై నమః ||
యా దేవీ సర్వభూతేషు మా స్కన్దమాతా రూపేణ సంస్థితా । నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ।
స్కందమాతను ఆరాధించడం ప్రాముఖ్యత
నవరాత్రులలో ఐదవ రోజున స్కందమాతను ఆరాధించడం ద్వారా సంతానం పొందడంలో ఆటంకాలు ఉన్నవారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఆదిశక్తి ఈ రూపం సంతానం కావాలి అన్న దంపతుల కోరికను నెరవేర్చడానికి పరిగణించబడుతుంది. స్కందమాత ఆరాధనలో కుమారుడు కార్తికేయను కలిగి ఉండటం అవసరమని భావిస్తారు. తల్లి అనుగ్రహం వల్ల మేధస్సు అభివృద్ధి చెందుతుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి