Dussehra 2021: దసరా మహోత్సవాలు అక్టోబర్ 7 నుంచి.. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకరణల వైభవం ఇలా..

Indrakeeladri Vijayadashami celebrations: ఏపీ విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 7 నుంచి 15 వరకు దసరా శరన్నవరాత్రులు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ ధర్మకర్తల మండలి

Dussehra 2021: దసరా మహోత్సవాలు అక్టోబర్ 7 నుంచి.. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకరణల వైభవం ఇలా..
Indrakeeladri Kanaka Durga Temple
Follow us
Shaik Madar Saheb

| Edited By: Phani CH

Updated on: Sep 13, 2021 | 9:03 AM

Indrakeeladri Vijayadashami celebrations: ఏపీ విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 7 నుంచి 15 వరకు దసరా శరన్నవరాత్రులు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ ధర్మకర్తల మండలి ఆదివారం వెల్లడించింది. ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీ ప్లవనామ సంవత్సర దసరా మహోత్సవాలు అతివైభవంగా నిర్వహించడం జరుగుతుందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పైలా సోమనాయుడు, కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై విజయవాడలో దసరా కో-ఆర్డినేషన్ సమావేశం నిర్వహించనున్నారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. కరోనా దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు.

అమ్మవారి దివ్య అలంకారముల వివరాలు.. 7-10-2021: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం రోజున శ్రీ స్వర్ణకవచాలంకరణ దుర్గాదేవిగా.. అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 8-10-2021: విదియ శుక్రవారం రోజున శ్రీ బాలా త్రిపురసుందరి దేవి. 9-10-2021: తదియ శనివారం రోజున శ్రీ గాయత్రీ దేవి. 10-10-2021: చవితి ఆదివారం రోజున శ్రీ లలితా త్రిపురసుందరి దేవి. 11-10-2021: పంచమి, షష్ఠి సోమవారం రోజున శ్రీ అన్నపూర్ణ దేవి, శ్రీ మహాలక్ష్మీ దేవి. 12-10-2021: శుద్ధ సప్తమి మంగళవారం రోజున శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం). 13-10-2021: శుద్ధ అష్టమి బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి (దుర్గాష్టమి). 14-10-2021: శుద్ధ నవమి గురువారం రోజున శ్రీ మహిషాసురమర్దని (మహార్ణవమి). 15-10-2021: శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి (విజయదశమి).

అయితే.. 11-10-2021 తేదీ సోమవారం రోజున శుద్ధ పంచమి, షష్ఠి తిధులు వచ్చినందున అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలోనూ, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుందన్నారు. శ్రీ శివకామసుందరి దేవి అమ్మవారికి (ఉపాలయం) కూడా పేర్కొన్న విధంగా అలంకారములు ఉంటాయని తెలిపారు. ఆలయ దర్శనవేళలు, టిక్కెట్లు బుకింగ్, మార్పులు చేర్పులు కోసం దేవస్థానం వెబ్‌సైట్‌లో సందర్శించవచ్చునని తెలిపారు.

Also Read:

Zodiac Signs: మీరు ధనుస్సు రాశికి చెందుతారా? అయితే, మీకు సరిజోడీలు వీరే..!

Chanakya Niti: ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నాలుగు విషయాలను ఎవరితోనూ పంచుకోకండి.. అలా చేస్తే చులకన అయిపోతారంటున్న చాణక్య

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్