Vidura Niti: లోకంలో నిద్రపట్టనివారు ఎవరు?.. మనిషికి ఆరు సుఖాలు ఏమిటో చెప్పిన విదురుడు..

Mahabharata-Vidura Niti: భారతీయ ధర్మశాస్త్రాలు మానవుడు ఎలా జీవిస్తే సమాజానికి మేలు జరుగుతుందో చెబుతున్నాయి. రామాయణం, మహాభారతం, భాగవతం వంటి పురాణాలలో పాటు వేమన, సుమతి, భర్తృహరి సుభాషితాలు..

Vidura Niti: లోకంలో నిద్రపట్టనివారు ఎవరు?.. మనిషికి ఆరు సుఖాలు ఏమిటో చెప్పిన విదురుడు..
Vidura Niti
Follow us
Surya Kala

|

Updated on: Sep 13, 2021 | 6:53 AM

Mahabharata-Vidura Niti: భారతీయ ధర్మశాస్త్రాలు మానవుడు ఎలా జీవిస్తే సమాజానికి మేలు జరుగుతుందో చెబుతున్నాయి. రామాయణం, మహాభారతం, భాగవతం వంటి పురాణాలలో పాటు వేమన, సుమతి, భర్తృహరి సుభాషితాలు ఆధునిక మనిషి జీవితంలో ఆచరించాల్సిన పద్ధతులు జీవించాల్సిన విధి విధానాలున్నాయి. వీటిని తెలుసుకోవడం నేటి మానవుడికి అత్యంత అవసరం. ఇక మహాభారతం ఉద్యోగపర్వంలో విదురుని ..  ధృతరాష్ట్రునికి  చెప్పిన సామజిక రాజకీయ, కుటుంబ జీవనానికి చెందిన నీతి శాస్త్ర విషయాలు “విదురనీతి” లుగా ప్రసిద్ధి చెందాయి. ఇందులో ఒక మనిషి మనిషిగా సమాజంలో జీవించాలంటే ధర్మార్ధ కామ మొక్షాలనే చతుర్విధ పురుషార్థాల సాధన కోసం చేయాల్సిన పనులు పూర్తిగా వివరించాడు విదురుడు. సంజయుడు పాండవుల వద్దకు రాయబారానికి వెళ్ళివచ్చిన  అనంతరం ధృతరాష్ట్రుడివి అన్నీ అధర్మ కృత్యాలేనని అధిక్షేపించాడు. అప్పటి నుంచి మానసిక క్షోభతో ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు. విదురుణ్ని పిలిచి మంచి మాటలతో తన మనసుకు ప్రశాంతత కలగజేయమన్నాడు. దీంతో విదురుడు దృతరాష్ట్రుడి లోకంలో నిద్రపట్టని వ్యక్తులు ఎవరో చెప్పాడు..

బలవంతుడితో విరోధం పెట్టుకున్న వాడికి, సంపద పోగొట్టుకున్న వాడికి, కాముకుడికి, దొంగకు నిద్ర ఉండదు అని విదురుడు చెప్పాడు.  అంతేకాదు జ్ఞానులు ఎలా ప్రవర్తిస్తారో, మూర్ఖులు ఎలా ఉంటారో విదుర వివరించాడు. జ్ఞాని తనకు అందనిదాన్ని గురించి ఆరాటపడనివాడు.. పోయినదాన్ని గురించి విచారించడు.. అంతేకాదు తనకు ఆపదలు ఏర్పడినప్పుడు కూడా వివేకం కోల్పోకుండా ఉంటాడు. అతనే జ్ఞాని అని చెప్పారు.  ఎంత సంపద, విద్య ఉన్నప్పటికీ ఉత్తముడు వినయంగానే ఉంటాడు.  అదే మూర్థుడు ఐతే .. తాను చేయవల్సిన పనిని అడుగడుగునా అనుమానిస్తూ, ఆలస్యంగా చేస్తాడు. తాను తప్పులు చేసినా ఎదుటివారిని నిందిస్తాడు.  తన వద్ద ధనం లేకపోయినా అత్యాశతో కోరికలను పెంచుకోవడం.. సమర్థత లేకపోయినా ఇతరులపై మండిపడతాడు. ఇదీ మూర్ఖులు ప్రవర్తించే తీరు అని చెప్పాడు విదురుడు.. ఇక తాను తినే పదార్థం నలుగురికీ పంచకుండా ఒక్కడే భుజించకూడదు… అలాగే తనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక్కడే కూర్చుని బయటపడే ఉపాయం ఆలోచించకూడదు.. అందరూ నిద్రపోతుంటే ఒక్కడే మెలకువతో ఉండకూడదు.

ఇక ఆరోగ్యం, ధన సంపాదన,  ప్రియమైన భార్య, చెప్పినట్లు వినే సంతానం, సంపాదనకు పనికివచ్చే విద్య ఇవి మనిషి ఉన్న ఆరు సుఖాలు.. ఇవి తన వద్ద ఉన్నామనిషి సుఖ సంతోషాలతో జీవితాంతం బతుకుతాడు. ప్రతి వ్యక్తి తన జీవితం ఏ కలతలు కష్టాలు లేకుండా ప్రశాంతంగా సాగిపోవాలని కోరుకుంటాడు. అయితే సమాజంలో శాంతి ఉన్నప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారు. ఇలా సమాజం శాంతియుతంగా ఉండాలంటే.. అందుకు నీతినియమాలు తోడ్పడతాయి. నీతి తప్పిన సమాజంలో అశాంతి నెలకొంటుందని విదురుడి చెప్పాడు. మనిషి ఏ పనులు చేయాలి.. ఏ పనులు చేయకూడదు అని చెప్పేదే విదురానీతులు.. అందుకనే ఇది “ధర్మశాస్త్రం” అని పేరుగాంచింది.

Also Read:  ఈరోజు వీరికి ఉద్యోగాల్లో అనుకూలం.. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.. రాశిఫలాలు..