వాస్తు శాస్త్రంలో బుద్ధుని విగ్రహం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇంట్లో బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్టించడం వల్ల ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. అన్ని రకాల సమస్యలు తీరుతాయని చాలామంది నమ్మకం. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంటి కుడి మూలలో బుద్ధుని విగ్రహాన్ని ఉంచడం వల్ల సానుకూల శక్తి వస్తుంది. అయితే, ఇంట్లో బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్టించే ముందు వాస్తు నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ ఇంట్లో బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ ముఖ్యమైన నియమాలను తెలుసుకోండి.
– మీరు ఇంట్లో బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నట్లయితే, ఆ విగ్రహాన్ని నేలపై లేదా లాకర్‌లో ఉంచవద్దు. వాస్తు శాస్త్రంలో ఇది నిషేధం. బుద్ధుని విగ్రహాన్ని నేలపై పెడితే వాస్తు దోషం పరిగణిస్తారు.
-వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం , బుద్ధుని బొమ్మను మీ కళ్ళకు సమాంతరంగా లేదా మీ తలపై అంటే నుదిటి ఎత్తులో ఉంచండి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇంట్లోని సభ్యులెవరూ బుద్ధుని వైపు కాళ్లు పెట్టి కూర్చోకూడదు.
-బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే, గాలిని శుద్ధి చేయడానికి ఇంట్లో ప్రతిరోజూ తేలికపాటి సువాసనగల అగరబత్తీలు వెలిగించాలి.
-జ్యోతిష్యుల ప్రకారం, వంటగదిలో, బాత్రూంలో లేదా పడకగదిలో బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్టించవద్దు. అలాగే, బుద్ధుని విగ్రహం దగ్గర షూ రాక్లు లేదా ఎలక్ట్రికల్ ఉపకరణాలు ఉంచవద్దు
-మీరు ఇంటిని సానుకూల శక్తితో నింపాలనుకుంటే, ఇంట్లో ఆశీర్వాద భంగిమలో బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్టించండి. ఈ విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద బుద్ధుని విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది.
-బుద్ధ భగవానుని విగ్రహాన్ని పడమర ముఖంగా ఉంచండి. నిద్రపోతున్న బుద్ధ భగవానుడు జ్ఞానం, విముక్తికి చిహ్నం. పడుకుని ఉన్న బుద్ధుని విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..