Diwali 2023: ప్రపంచంలోని ఈ మూడు దేశాల్లో దీపావళిని చాలా ప్రత్యేకమైన మార్గాల్లో జరుపుకుంటారు

|

Nov 09, 2023 | 8:32 AM

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలు దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి పండుగను భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. దీపావళి పండుగను చాలా ప్రత్యేకమైన రీతిలో జరుపుకునే ప్రపంచంలోని ఆ దేశాల గురించి ఈ రోజున తెలుసుకుందాం.. 

Diwali 2023: ప్రపంచంలోని ఈ మూడు దేశాల్లో దీపావళిని చాలా ప్రత్యేకమైన మార్గాల్లో జరుపుకుంటారు
Diwali Fest
Follow us on

దీపావళి హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రజలు ఏడాది పొడవునా ఈ పండుగ కోసం ఎదురుచూస్తుంటారు. దీపావళి రోజున రాముడు అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడు. ఆయన రాకను పురస్కరించుకుని ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారు. ఈ పండుగ రోజున భారతదేశం మొత్తం దీపాల వెలుగుతో ప్రకాశిస్తుంది. ముఖ్యంగా అయోధ్యలో దీపావళి రోజు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ లక్షల దీపాలు ఏకకాలంలో వెలుగుతాయి.

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలు దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి పండుగను భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. దీపావళి పండుగను చాలా ప్రత్యేకమైన రీతిలో జరుపుకునే ప్రపంచంలోని ఆ దేశాల గురించి ఈ రోజున తెలుసుకుందాం..

జపాన్: ఈ దేశంలో దీపావళిని చాలా విభిన్నంగా జరుపుకుంటారు. ఇక్కడ ప్రజలు దీపావళి పండుగను తోటలకు వెళ్లి జరుపుకుంటారు. జపాన్ ప్రజలు దీపావళి రోజున దీపాలకు బదులుగా రంగురంగుల లాంతర్లను ఉపయోగిస్తారు. చెట్లను అలంకరిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంతోషం, శ్రేయస్సు ,  పురోభివృద్ధి కలుగుతుందని జపాన్ ప్రజలు నమ్ముతారు. ఇక్కడ దీపావళి రోజున, ప్రజలు రాత్రంతా నృత్యం చేసి పండుగను ఆనందిస్తారు.

ఇవి కూడా చదవండి

మలేషియా : ఈ దేశంలో దీపావళిని హరి దీపావళి అని పిలుస్తారు. మలేషియాలో కూడా ప్రజలు దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే ఇక్కడ హిందూ జనాభా మాత్రమే దీపావళి పండుగను జరుపుకుంటారు. గణాంకాల ప్రకారం మలేషియా మొత్తం జనాభా దాదాపు 3.5 కోట్లు.. ఇందులో మొత్తం హిందువుల జనాభా దాదాపు 21 లక్షలు. ఇక్కడ ప్రజలు తమ ఇళ్ల వెలుపల కొవ్వొత్తులను, దీపాలను వెలిగిస్తారు. మలేషియాలో దీపావళి రోజున ముందుగా శరీరానికి నూనె రాసుకుని స్నానం చేస్తారు.

శ్రీలంక: ఈ దేశం రామాయణ కాలంతో ముడిపడి ఉంది. శ్రీలంకలో భారీ సంఖ్యలో హిందూ ప్రజలు  నివసిస్తున్నారు, ఇక్కడ ప్రజలు లామ్ క్రియోంగ్ పేరుతో దీపావళిని జరుపుకుంటారు. ఇక్కడ దీపావళి పద్ధతి కొద్దిగా భిన్నంగా ఉంటుంది, ప్రజలు దీపాలలో కొవ్వొత్తులు, నాణెం, ధూపం ఉంచుతారు. దీనిని ప్రవహించే నది నీటిలో వదులుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..