Kashi: కాశీ క్షేత్రంలో ఘర్షణ.. భక్తులు, సిబ్బంది కొట్లాట.. ఆ విషయంలో వాగ్వాదం
ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలోని (Kashi) శ్రీ కాశీవిశ్వనాథుని ఆలయంలో ఘర్షణ జరిగింది. భక్తులు, సిబ్బంది చెలరేగిపోయారు. దర్శనం విషయంలో భక్తులు, ఆలయ సిబ్బందికి మధ్య మాటామాటా పెరగింది. ఇది పరస్పరం...
ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలోని (Kashi) శ్రీ కాశీవిశ్వనాథుని ఆలయంలో ఘర్షణ జరిగింది. భక్తులు, సిబ్బంది చెలరేగిపోయారు. దర్శనం విషయంలో భక్తులు, ఆలయ సిబ్బందికి మధ్య మాటామాటా పెరగింది. ఇది పరస్పరం దాడులకు దారి తీసింది. తాము దైవసన్నిధిలో ఉన్నామన్న విచక్షణ కోల్పోయిన భక్తులు ఓవైపు.. స్వామివారికి సేవ చేస్తున్నామన్న విషయాన్ని మరిచిన సిబ్బంది మరోవైపు.. ఘర్షణకు దిగారు. జూలై 23 సాయంత్రం ఆలయ గర్భగుడి వద్ద హారతి ఇస్తున్న సమయంలో తలుపులు మూసేసినా దర్శనం కోసం ఇద్దరు భక్తులు పట్టుబట్టారు. వారిని ఆలయ సిబ్బంది అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వివాదం మొదలైంది. ఆ తర్వాత అది మరింత ముదరడంతో భక్తులు, ఆలయ సిబ్బంది కొట్టుకున్నారు.
గర్భగుడి నుంచి భక్తులను బయటకు పంపిన తర్వాత ఆలయ సిబ్బంది నిర్వాహకులకు లేఖ రాశారు. తమకు పోలీసులు సహకరించలేదని అందులో ఆరోపించారు. మరోవైపు, ఇద్దరు భక్తులు నలుగురు ఆలయ సిబ్బంది సహా ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల క్రితం కూడా ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. తరచూ ఆలయంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధారకరమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..