Vastu Tips: కుటుంబాన్ని దరిద్రం వెంటాడుతోందా? అయితే, ఈ విగ్రహం ఇంట్లో ఉందేమో చూసుకోండి..!

Vastu Tips: ఆది శంకరుడు, పరమేశ్వరుడిగా పిలుచుకునే శివుడిని చాలా మంది భక్తులు ఆరాధిస్తారు. ఆయన పూజలో తరంచిపోతారు.

Vastu Tips: కుటుంబాన్ని దరిద్రం వెంటాడుతోందా? అయితే, ఈ విగ్రహం ఇంట్లో ఉందేమో చూసుకోండి..!
Vastu Tips
Follow us

|

Updated on: Jul 25, 2022 | 6:14 AM

Vastu Tips: ఆది శంకరుడు, పరమేశ్వరుడిగా పిలుచుకునే శివుడిని చాలా మంది భక్తులు ఆరాధిస్తారు. ఆయన పూజలో తరంచిపోతారు. భారతదేశంలో శివుని చిత్రపటం, శివలింగం గానీ లేని హిందువుల ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతీ సోమవారం నాడు భక్తులు ఆలయాలకు వెళ్లడం, ప్రత్యేక పూజలు చేయడం, ఉపవాసాలు పాటించడం వంటివి చేస్తుంటారు. కొంత మంది తమ ఇళ్లలోనే శివుని విగ్రహాన్ని ఉంచి పూజిస్తుంటారు. శివుడిని పూజించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఇంట్లోని చెడు బయటకు పోయి.. సానుకూల శక్తి ఏర్పడుతుందని నమ్ముతారు.

అయితే, కొందరు మాత్ర పరమేశ్వరుడిని ఆరాధిస్తున్నప్పటికీ.. పేదరికంలో మగ్గిపోతుంటారు. అలాంటి వాటికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు, వేదాంతులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో శివుడి ఉగ్ర రూపానికి సంబంధించిన ఫోటో గానీ, విగ్రహం కానీ ఉండకూడదంటున్నారు. నటరాజ స్వామి విగ్రహం, శివుడు ఆగ్రహంతో ఉన్న ప్రతిమలు.. ఇంట్లో ప్రతికూల శక్తిని కలిగిస్తాయంటున్నారు. ఒకవేళ అలాంటి విగ్రహాలు, ఫోటోలు ఉన్నట్లయితే వెంటనే తీసివేయాలని సూచిస్తున్నారు.

ఎలాంటి ఫోటోలు ఉండాలి.. శాంత స్వభావంతో కూడిన శివుడి ఫోటో గానీ, విగ్రహం గానీ ఇంట్లో ఉండాలి. సతీసమేతంగా పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉండటం చాలా ఉత్తమం అని సూచిస్తున్నారు. ఈ ఫోటో ఇంట్లో ఉండే.. ఆదిదంపతుల కరుణ, ఆశీర్వాదం లభిస్తాయని విశ్వాసం. కుటుంబంలో శాంతి నెలకొని.. లక్ష్మీ దేవి కొలువుదీరుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!