AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రహ్మ ప్రతిష్టించిన శివలింగం.. వనవాస సమయంలో శ్రీ రాముడే స్వయంగా పూజించిన ఆలయం ఎక్కడంటే..

శ్రీ రాముడు తన 14 సంవత్సరాల వనవాసం కాలంలో కొంత కాలం తపభూమిగా ప్రసిద్ధి చెందిన చిత్రకూటములో గడిపాడు. ఇది ఒక పవిత్రమైన కొండ ప్రాంతం. ఇక్కడ సీతారామ లక్ష్మణుడు నివసించారు. అటువంటి ఈ తపోభూమిలో అద్భుతమైన శివాలయం ఉంది. ఇది భక్తులకు విశ్వాసం, అద్భుతాలకు కేంద్రంగా ఉంది. ఈ ఆలయాన్ని మత్యగజేంద్రనాథ ఆలయం అని అంటారు. ఇది రామ్ ఘాట్‌లో ఉంది. ఈ ఆలయం ప్రాముఖ్యత గురించి ఈ రోజు తెలుసుకుందాం..

బ్రహ్మ ప్రతిష్టించిన శివలింగం.. వనవాస సమయంలో శ్రీ రాముడే స్వయంగా పూజించిన ఆలయం ఎక్కడంటే..
Matgajendra Nath Temple
Surya Kala
|

Updated on: Jul 08, 2025 | 4:26 PM

Share

భారతదేశపు మతపరమైన పురాణ నగరం చిత్రకూటము. ఈ నగరం ప్రతి ఆణువణువూ శ్రీరాముని ఉనికిని కలిగి ఉంది. ఈ పవిత్ర భూమిపై రామ్‌ఘాట్ సమీపంలో ఒక అతీంద్రియ శివాలయం ఉంది. దీని ప్రాముఖ్యత మొత్తం భారతదేశంలోనే ప్రత్యేకమైనది. ఇది మత్యగజేంద్రనాథ ఆలయం ఆలయం. ఇక్కడ ప్రతిష్టించబడిన శివలింగం రాముడు, బ్రహ్మ కలిసి స్థాపించారని నమ్ముతారు. ఈ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు భక్తుల విశ్వాసం, పురాణాలకు సజీవ చిహ్నం. భారతదేశం అంతటా లెక్కలేనన్ని శివాలయాలు ఉన్నాయి. అయితే శ్రీరాముడు తపస్సు చేసిన ఈ ప్రదేశంలో ఉన్న ఈ ప్రత్యేకమైన ఆలయానికి భిన్నమైన గుర్తింపు ఉంది.

శ్రీరాముడు, బ్రహ్మ స్థాపించిన శివలింగం

మత్యగజేంద్రనాథ ఆలయం అతి ముఖ్యమైన లక్షణం దాని పురాతన శివలింగం. నమ్మకాల ప్రకారం ఈ పవిత్ర శివలింగాన్ని బ్రహ్మతో పాటు రాముడు తన వనవాస కాలంలో ప్రతిష్టించాడు. ఈ విశిష్టతతోనే ఈ ఆలయాన్ని దర్శించించేందుకు భక్తులు అమితాసక్తిని చూపిస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ శివలింగాన్ని చిత్రకూట రాజు అని కూడా పిలుస్తారు. అందుకే ఈ ఆలయానికి మత్యగజేంద్రనాథ అని పేరు పెట్టారు. ఈ పేరు ఈ పవిత్ర నగరంలో అత్యున్నత పాలకుడైన శివుని భారీ రూపాన్ని ప్రతిబింబిస్తుంది.

శ్రావణ మాసంలో ఈ మత్యగజేంద్రనాథుడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. సమీపంలోని ప్రాంతాల నుంచి మాత్రమే కాదు.. ఇతర ప్రాంతాల నుంచి కన్వర్ (కావడి) యాత్రికులు ఇక్కడికి చేరుకుని తమ కన్వర్ యాత్ర పూర్తి కావడానికి ఈ పవిత్ర శివలింగానికి నీటిని సమర్పిస్తారు. ఇక్కడ నీరు సమర్పించక పొతే తమ కావడి యాత్ర విజయవంతం కాదని నమ్ముతారు. ఇది ఈ ఆలయం ప్రాముఖ్యతకు, భక్తుల అచంచల విశ్వాసానికి చిహ్నంగా ఉంది.

ఈ ఆలయం చరిత్ర, విశ్వాసంల సంగమం

మత్యగజేంద్రనాథుడి ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు.. వేల సంవత్సరాల విశ్వాసం, సంప్రదాయం, నమ్మకానికి సజీవ రుజువు. ఇక్కడ ఉన్న ప్రతి గోడ, ప్రతి గంట, ప్రతి శబ్దం శివుడు, రాముడి దివ్య ఉనికిని అనుభూతి చెందేలా చేస్తుంది.

కోరికలను తీర్చుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం

ఈ ఆలయంతో ముడిపడి ఉన్న మరో ప్రత్యేక నమ్మకం ఏమిటంటే ఎవరైనా సరే బిల్వ పత్రం మీద రామ రామ అని రాశి శ్రావణ మాసంలో ఇక్కడ ఉన్న శివలింగానికి సమర్పిస్తే.. భక్తుడు కోరిన కోర్కెలు అన్నీ నెరవేరుతాయని నమ్మకం. ఈ సంప్రదాయంతో శ్రీ రాముడిపై అపారమైన విశ్వాసం, శివుడి పట్ల భక్తికి సంబందించిన అందమైన సంగమానికి నిదర్శనంగా నిలుస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.