Srisailam Temple: శ్రీశైలంలో మళ్లీ చార్టర్ ఫ్లైట్ కలకలం.. దర్యాప్తు మొదలు పెట్టిన ఆలయ సిబ్బంది

శ్రీశైలం క్షేత్రం చుట్టూ చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఇప్పటికే పలు మార్లు ఆలయ పరిసరాలలో డ్రోన్ చక్కర్లు కొట్టగా.. ఇప్పటి వరకూ దాని ఆచూకీని ఆలయ సిబ్బంది కనిపెట్టలేదని చెబుతున్నారు.

Srisailam Temple: శ్రీశైలంలో మళ్లీ చార్టర్ ఫ్లైట్ కలకలం.. దర్యాప్తు మొదలు పెట్టిన ఆలయ సిబ్బంది
Srisailam No Fly Zone
Follow us
Narender Vaitla

|

Updated on: May 04, 2023 | 2:07 PM

ఇటీవల హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి పై డ్రోన్స్ కలకలం సృష్టించిన విషయం ఇంకా మరిచిపోక ముందే.. ఇప్పుడు ఏపీలోని మరో ప్రముఖ క్షేత్రంలో చార్టర్ ఫ్లైట్ కలకలం సృష్టించింది. నంద్యాలజిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మరోసారి కలకలం రేగింది. మల్లన్న ఆలయ పరిసరాల్లో  గుర్తు తెలియని చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టింది.

శ్రీశైలం క్షేత్రం చుట్టూ చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఇప్పటికే పలు మార్లు ఆలయ పరిసరాలలో డ్రోన్ చక్కర్లు కొట్టగా.. ఇప్పటి వరకూ దాని ఆచూకీని ఆలయ సిబ్బంది కనిపెట్టలేదని చెబుతున్నారు. డ్రోన్ ను చూసిన సిబ్బంది దానిని పట్టుకోవడానికి ప్రయత్నించగా అది సాధ్యం కాలేదంటూ గుర్తు చేసుకున్నారు.

ఇప్పుడు శ్రీశైలం ఆలయ పరిసరాలతో పాటు.. మల్లన్న ఆలయం చుట్టూ చార్టర్ ఫ్లైట్ చక్కర్లు కొట్టడంతో       స్థానికులు, భక్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి శ్రీశైలం ఆలయ శిఖర ప్రాంతం నో ఫ్లయింగ్ జోన్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నో ఫ్లయింగ్ జోన్ ప్రాంతంలో చార్టర్ ఫ్లైట్  చక్కర్లు కొట్టడంతో ఆలయ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఆలయ పోలీస్ అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి విచారణ ప్రారంభించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..