AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: హనుమంతుని జన్మస్థలం కిష్కింధ నుంచి రామయ్య సన్నిధికి చేరుకున్న రథం..

ఈ రథ యాత్రలో భాగంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రయాణిస్తూ..  ప్రాణ ప్రతిష్టకు ముందు అయోధ్యకు చేరేలా ప్రణాళిక వేసుకున్నామని.. అయితే రామయ్య ఇంటికి చేరుకునే ముందు అత్తారింటికి రథయాత్ర నిర్వహించినట్లు వెల్లడించారు. జనవరి 25 వరకు అయోధ్యలో ఉంటుంది" అని   అభిషేక్ కృష్ణశాస్త్రి చెప్పారు. "రాముడికి సేవ చేయడానికి తాము కిష్కింధ నుండి ఇక్కడకు వచ్చాము.

Ayodhya: హనుమంతుని జన్మస్థలం కిష్కింధ నుంచి రామయ్య సన్నిధికి చేరుకున్న రథం..
Lord Hanuman Chariot
Surya Kala
|

Updated on: Jan 20, 2024 | 12:52 PM

Share

కర్ణాటకలోని హంపి ప్రాంతంలో ఉన్న హనుమంతుడి జన్మస్థలమైన కిష్కింధ నుంచి బయలు దేరిన ఒక ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకుంది. ఈ నెల 22న జరిగే రామాలయంలో జరిగే ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు అయోధ్యకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను సందర్శిస్తూ ఈ నేడు అయోధ్యకు చేరుకుంది. అయితే ఈ రథం అయోధ్యకు చేరుకోవడానికి ముందు ప్రస్తుత నేపాల్‌లోని సీతాదేవి జన్మస్థలం జనక్‌పూర్‌కు వెళ్లింది. రథంతో 100 మంది భక్తుల బృందం “జై శ్రీ రామ్” నినాదాలు చేస్తూ రాముడి చిత్రాలున్న కాషాయ జెండాల చేతబట్టి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ రథంతో ప్రయాణించారు.

అయోధ్యలో బాల రాముడు కొలువుదీరుతున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు అయోధ్యకు చేరుకుంటుంటే.. రామ భక్తుడు హనుమంతుడు అయోధ్యకు చేరుకోకపోతే ఎలా అంటూ శ్రీ హనుమాన్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిథి అభిషేక్ కృష్ణశాస్త్రి చెప్పారు. అంతేకాదు ఈ రథ యాత్రలో భాగంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రయాణిస్తూ..  ప్రాణ ప్రతిష్టకు ముందు అయోధ్యకు చేరేలా ప్రణాళిక వేసుకున్నామని.. అయితే రామయ్య ఇంటికి చేరుకునే ముందు అత్తారింటికి రథయాత్ర నిర్వహించినట్లు వెల్లడించారు. జనవరి 25 వరకు అయోధ్యలో ఉంటుంది” అని   అభిషేక్ కృష్ణశాస్త్రి చెప్పారు.

“రాముడికి సేవ చేయడానికి తాము కిష్కింధ నుండి ఇక్కడకు వచ్చాము. రథంలో రాముడు హనుమంతుడిని కౌగిలించుకున్న విగ్రహం ఉందని అన్నారాయన. అయోధ్యలో పర్యటించిన తర్వాత రథాన్ని సరయు నది ఒడ్డున నిలిపి ఉంచారు. పర్యాటకులు, భక్తుల దృష్టిని ఆకర్షిస్తుంది. భారీ రథం బంగారు వర్ణంలో చెక్కిన దేవాలయంలా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

హనుమంతుని జన్మస్థలంలో ఆలయాన్ని నిర్మించాలనుకుంటున్నామని యాత్రలో తమకు అందుతున్న విరాళాలన్నింటినీ ఆలయ నిర్మాణానికి వినియోగిస్తానని కృష్ణశాస్త్రి చెప్పారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..