Dream 11: గ్యాస్ సిలిండర్ డెలివరీబోయ్‌ని వరించిన అదృష్టం.. రూ. 49తో గేమ్ ఆడి కోట్లు గెలుచుకున్న యువకుడు
కష్టానికి తోడు కాస్త అదృష్టం కూడా తోడైతే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఇంటింటికీ గ్యాస్ సిలిండర్‌లు డెలివరీచేసే యువకుడిని లాటరీ జాక్‌పాట్ రూపంలో ఒక్కసారిగా కోటీశ్వరుడిని చేసింది. ఇది కదా అదృష్టం అంటే...బిహార్‌లోని అరారియా జిల్లా పటేగనా గ్రామానికి చెందిన సాదిఖ్ స్థానికంగా ఓ ఏజెన్సీలో గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి క్రికెట్ అంటే అమితమైన ఆసక్తి. దీంతో అతను డ్రీమ్-11 యాప్‌లో తరచూ గేమ్స్ ఆడుతూ ఉంటాడు.
కష్టే ఫలి.. అని పెద్దలంటూ ఉంటారు.. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుందని అర్థంగా చెప్పుకోవచ్చు. అయితే కష్టపడే ప్రతిఒక్కరికీ ఆశించినస్థాయిలో ఫలితం దక్కకపోవచ్చు. ఒక్కొక్కరికి ఊహించని విధంగా కష్టానికి మించిన ఫలితం దక్కవచ్చు. అయితే కష్టానికి తోడు కాస్త అదృష్టం కూడా తోడైతే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఇంటింటికీ గ్యాస్ సిలిండర్‌లు డెలివరీచేసే యువకుడిని లాటరీ జాక్‌పాట్ రూపంలో ఒక్కసారిగా కోటీశ్వరుడిని చేసింది. ఇది కదా అదృష్టం అంటే…
బిహార్‌లోని అరారియా జిల్లా పటేగనా గ్రామానికి చెందిన సాదిఖ్ స్థానికంగా ఓ ఏజెన్సీలో గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి క్రికెట్ అంటే అమితమైన ఆసక్తి. దీంతో అతను డ్రీమ్-11 యాప్‌లో తరచూ గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఈ క్రమంలో జనవరి 14న జరిగిన భారత్-ఆఫ్గనిస్థాన్ టీ20 మ్యాచ్ సందర్భంగా డ్రీమ్-11లో ఫాంటసీ క్రికెట్ గేమ్ ఆడాడు. కేవలం 49 రూపాయలు మాత్రమే పెట్టుబడిగా పెట్టి అతను గేమ్ ఆడాడు. ఈ మ్యాచ్ గేమ్‌లో ఆ యువకుడు 974.5 పాయింట్లతో మొదటిస్థానంలో నిలవడమే కాకుండా కోటిన్నర గెలుచుకున్నాడు. దీంతో సాదిఖ్ కుటుంబం ఆనందంలో మునిగిపోయారు. మరోవైపు, ఈ విషయంపై గ్యాస్ ఏజెన్సీ డైరెక్టర్ జితేంద్ర స్పందిస్తూ.. సాదిఖ్ బ్యాంకు ఖాతాకు డబ్బులు వచ్చిన వెంటనే వాటిని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశామని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..