Andhra Pradesh: శీతల గిడ్డంగిలో అగ్ని ప్రమాదం… పసుపు బస్తాలు దగ్దం.. ఐదుగురికి గాయాలు

రాత్రి పది గంటల సమయంలో స్టోరేజ్ ప్రధాన ద్వారం తెరిచి లోపలికి వెళ్ళేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నించారు. అయితే ద్వారం తెరుచుకోగానే మంటలు బయటకు వ్యాపించాయి. దీంతో ఐదుగురు సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన వారిలో జిల్లా అగ్నిమాపకాధికారి శ్రీనివాసరెడ్డితో పాటు సహాయాధికారి కృష్ణా రెడ్డి మరో ముగ్గురు సిబ్బంది ఉన్నారు‌.

Andhra Pradesh: శీతల గిడ్డంగిలో అగ్ని ప్రమాదం... పసుపు బస్తాలు దగ్దం.. ఐదుగురికి గాయాలు
Accident In Cold Storage
Follow us
T Nagaraju

| Edited By: Surya Kala

Updated on: Jan 20, 2024 | 12:15 PM

శుక్రవారం సాయంత్రం కోల్డ్ స్టోరేజ్ నుండి మొదట పొగ వెలువడింది. పెద్ద ఎత్తున పసుపు బస్తాలు దాచిన శీతల గిడ్డంగి నుండి పొగ వెలువడుతుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి రాకుండా పోతుందేమోనని రైతులు భయాందోళనకు గురయ్యారు. అన్నదాతలు అనుకున్నట్లుగానే అగ్ని ప్రమాదం‌ పెద్దదయింది. మంటలు స్టోరేజ్ మొత్తం వ్యాపించి పసుపు బస్తాలు దగ్దం అయ్యాయి.

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో పసుపు మార్కెట్ యార్డు ఉంది.. రాష్ట్రంలోనే ఈ మార్కెట్ అతి పెద్దది. ఇక్కడ ఒక్క గుంటూరు జిల్లా నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి రైతులు తమ పసుపు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో శీతల గిడ్డంగుల నిర్మాణం జరిగింది. శుభం మహేశ్వరి శీతల గిడ్డంగిలో నిన్న సాయంత్రం ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం‌ చోటు చేసుకుంది. అర్థరాత్రి సమయానికి మంటలు స్టోరేజ్ మొత్తం వ్యాపించి పసుపు బస్తాలను కాల్చి వేశాయి. మంటలను అదుపు చేసేందుకు ఐదు అగ్ని మాపక యంత్రాలను రంగంలోకి దించారు.

రాత్రి పది గంటల సమయంలో స్టోరేజ్ ప్రధాన ద్వారం తెరిచి లోపలికి వెళ్ళేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నించారు. అయితే ద్వారం తెరుచుకోగానే మంటలు బయటకు వ్యాపించాయి. దీంతో ఐదుగురు సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన వారిలో జిల్లా అగ్నిమాపకాధికారి శ్రీనివాసరెడ్డితో పాటు సహాయాధికారి కృష్ణా రెడ్డి మరో ముగ్గురు సిబ్బంది ఉన్నారు‌. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం సిబ్బంది పన్నెండు గంటలకు పైగా కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు. తెల్లవారు జామున గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి స్టోరేజ్ ను పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అయితే  భారీ మొత్తంలో నిల్వ ఉంచిన పసుపు బస్తాలు కాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తీవ్రంగా నష్టపోయామంటున్నారు.

ఇవి కూడా చదవండి

గతంలోనూ గుంటూరు నగరం చుట్టూ ఉన్న శీతల గోదాముల్లోనూ అగ్ని ప్రమాదాలు జరిగి మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. భీమా సొమ్ము కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన ఘటనలో ఉన్నాయి. ఇప్పుడు జరిగిన అగ్ని ప్రమాదం‌లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్