Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కాకి వెళ్లిందని నిరుపయోగంగా వదిలేసినా బంగ్లా.. 130 ఏళ్ల నాటి భవనానికి కొత్త రూపం..

ఐదు ఎకరాల విస్తీర్ణంలో ‌ఉన్న ఈ బంగ్లా చుట్టూ పిచ్చి మొక్కలు ‌పెరగడంతోపాటు పాడుబడి బంగ్లాగా మారి పోయింది.దశాబ్దాల కాలంగా నిరుపయోగంగా ఉన్న భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది.మందు బాబులకు మద్యం సేవించడానికి,పేకాట రాయుళ్ళు పేకాట అడగటానికి, వ్యభిచారులకు వేశ్య భవనంగా మారిపోయింది.

Andhra Pradesh: కాకి వెళ్లిందని నిరుపయోగంగా వదిలేసినా బంగ్లా.. 130 ఏళ్ల నాటి భవనానికి కొత్త రూపం..
Sub Collector Bungalow
Follow us
J Y Nagi Reddy

| Edited By: Surya Kala

Updated on: Jan 20, 2024 | 12:05 PM

అది 130 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలం నాటి భవనం. అప్పటి నిర్మాణాన్ని భవిష్యత్తు తరాలకి అందించేందుకు ఉపయోగంలోకి తెచ్చింది ప్రభుత్వం. కోటి రూపాయలు ఖర్చు చేసి ఆధునికరించి సబ్ కలెక్టర్ కి బంగ్లా గా ఇచ్చింది. ఇంతకీ ఆ బంగ్లా విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1996 లో కట్టిన సబ్ కలెక్టర్ బంగ్లా అది. ఎన్నో ఎళ్ళు ఆ భవనంలో ఎంతో మంది సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు ఆ  బంగ్లాలో నివాసం ఉంటు విధులకు హాజరయ్యే వారు. దశాబ్దాల కాలంగా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉన్న అ భవనాన్ని కోటి రూపాయల వ్యయంతో సర్వాంగ సుందరంగా ఆధునీకరణ పనులు చేపట్టి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేతుల మీదుగా ప్రారంభం అయింది.

1896లో కట్టిన సబ్ కలెక్టర్ బంగ్లాలోకి భవనం కాకి దూరింది. బంగ్లాలోకి కాకి ప్రవేశించడం అపశకునంగా భావించిన అధికారులు అప్పటి నుంచి అ బంగ్లా నివాసం ఉండటానికి నిరాకరించారు. దీంతో దశాబ్దాల కాలంగా అ భవనంలో నిరుపయోగం ఉంది.

ఇవి కూడా చదవండి

ఐదు ఎకరాల విస్తీర్ణంలో ‌ఉన్న ఈ బంగ్లా చుట్టూ పిచ్చి మొక్కలు ‌పెరగడంతోపాటు పాడుబడి బంగ్లాగా మారి పోయింది.దశాబ్దాల కాలంగా నిరుపయోగంగా ఉన్న భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది.మందు బాబులకు మద్యం సేవించడానికి,పేకాట రాయుళ్ళు పేకాట అడగటానికి, వ్యభిచారులకు వేశ్య భవనంగా మారిపోయింది.

2022 వ సంవత్సరం ఏప్రిల్ 5వ తేధీన నంద్యాలను ప్రభుత్వం జిల్లాగా ఏర్పడింది. జిల్లా కార్యాలయాల కోసం భవనాల పరిశీలనలో భాగంగా పాడుబడిన పురాతన సబ్ కలెక్టర్ భవనం గుర్తించడం, భవనం మనుగడలొకి తీసుకొని రావడానికి కలెక్టర్ మనజీరగ జిలాని, మంత్రి బుగ్గన చొరవ చూపించారు.

దీంతో బంగ్లా మరమ్మత్తుల కోసం నిధుల కేటాయించడంతో పనులు మొదలు కావడం జరిగింది.అధునిక కాలంకు అనుగుణంగా భవనాన్ని నిర్మించారు.బ్రిటిష్ కాలం నాటి భవనం లోపల అధునిక వసతులతో నిర్మాణ పనులు చెయ్యడం అందరిని ఆకట్టుకుంది.

నిరుపయోగంగా ఉన్న భవనాన్ని మనుగడలోకి తీసుకొని రావడంతో పాటు భవనం పై ఉన్న అపోహలను తొలగిస్తూ.. బంగ్లాలో నివాసాం ఉండటానికి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ముందుకు రావడం హర్షించదగిన విషయం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..