AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: వైఎస్ షర్మిల కడప పర్యటన ఖరారు.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షపదవి చేపట్టేందుకు సిద్దం..

వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. అందులో భాగంగా శనివారం ఇడుపులపాయకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్నారు. కడపలో ఘనస్వాగతం పలికేందుకు షర్మిల అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, జిల్లా నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తరువాత కడప నుండి ఇడుపులపాయకు ర్యాలీగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

YS Sharmila: వైఎస్ షర్మిల కడప పర్యటన ఖరారు.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షపదవి చేపట్టేందుకు సిద్దం..
YS Sharmila
Srikar T
|

Updated on: Jan 20, 2024 | 10:30 AM

Share

కడప, జనవరి 19: వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. అందులో భాగంగా శనివారం ఇడుపులపాయకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్నారు. కడపలో ఘనస్వాగతం పలికేందుకు షర్మిల అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, జిల్లా నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తరువాత కడప నుండి ఇడుపులపాయకు ర్యాలీగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. తదనంతరం తండ్రి ఆశీస్సులు తీసుకుని సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో రాజకీయాల్లో అడుగుపెడుతున్న తరుణంలో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈరోజు రాత్రి ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్‎లో బస చేయనున్నారు. తిరిగి ఆదివారం ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు. విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉదయం 11 గంటలకు ఏపీసీసీ ఛీఫ్‎గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ తరువాత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.

నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర పేరుతో సుదీర్ఘ దూరం ప్రయాణించారు షర్మిల. అయితే కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మద్దతు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని భావించింది. ఇందులో భాగంగానే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాలని ఆదేశించింది. అయితే గత రెండు రోజుల క్రితం కుమారుడి నిశ్చితార్థ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక తరువాత ప్రత్యక్ష రాజీయాల్లో క్రియాశీలకంగా బాధ్యతలు చేపట్టాలని భావించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు పార్టీ నేతలు. అయితే ఏపీలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి పూర్వవైభవం తీసుకొస్తారా.. ప్రస్తుతం ఆమె ముందు ఉన్న సవాళ్లను అధిగమిస్తారా అన్న ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది. దీనిపై శనివారం ఏర్పాటు చేయనున్న సమావేశంలో ఏమైనా స్పష్టత ఇస్తారా అనేది వేచిచూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..