Lunar Eclipse 2022: ఈ నెల 16న ఈ ఏడాదిలో ఫస్ట్ చంద్రగ్రహణం.. దీని ప్రభావం ఏఏ దేశాలపై ఉండనున్నదంటే

Lunar Eclipse 2022: సూర్యగ్రహణం(Solar Eclipse) వలె, సనాతన ధర్మంలో చంద్రగ్రహణానికి(Chandra Grahanam) ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది  సూర్యగ్రహణం తర్వాత..

Lunar Eclipse 2022: ఈ నెల 16న ఈ ఏడాదిలో ఫస్ట్ చంద్రగ్రహణం.. దీని ప్రభావం ఏఏ దేశాలపై ఉండనున్నదంటే
Chandra Grahan 2022
Follow us
Surya Kala

|

Updated on: May 04, 2022 | 9:02 AM

Lunar Eclipse 2022: సూర్యగ్రహణం(Solar Eclipse) వలె, సనాతన ధర్మంలో చంద్రగ్రహణానికి(Chandra Grahanam) ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది  సూర్యగ్రహణం తర్వాత సరిగ్గా 15 అనంతరం చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ నెల 16 వ తేదీ  2022న సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఏర్పడనున్నది. హిందూ క్యాలెండర్ ప్రకారం, 2022 సంవత్సరంలో రెండు చంద్రగ్రహణాలు రానున్నాయి. ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం వైశాఖ పూర్ణిమ రోజున  ఏర్పాడనున్నది. అయితే ఈ సంవత్సరం సంభవించనున్న చంద్రగ్రహణాలు రెండూ సంపూర్ణమైనవి. ఈ గ్రహణం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కనిపించబోతోంది. అయితే ఈ చంద్ర గ్రహణాల ప్రభావం భారతదేశంలో తక్కువగా కనిపిస్తుందని తెలుస్తోంది.  ప్రపంచంలోని ఏయే ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం.

2022లో చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడనున్నదంటే..  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 2022లో మొదటి చంద్రగ్రహణం 16 మే 2022న,  రెండవది 2022 నవంబర్ 8న ఏర్పడనున్నాయి పంచాంగం ప్రకారం మొదటి గ్రహణం సోమవారం ఉదయం 08:59 గంటలకు ప్రారంభమై ఉదయం 10:23 వరకు ఉంటుంది. భారతదేశంలో చంద్రగ్రహణం ప్రభావం పాక్షికంగానే ఉండనుంది.

మొదటి చంద్రగ్రహణం 2022 ఏఏ ప్రదేశాల్లో కనిపించనున్నదంటే..  2022 మే 16న సంభవించే చంద్రగ్రహణం నైరుతి యూరప్, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాలు, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్, అంటార్కిటికా మొదలైన దేశాల్లో పూర్తిగా కనిపిస్తుంది.  అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావం మనదేశంలో లేదు.. కనుక ఈ గ్రహణ సమయాన్ని సూతకాలంగా పరిగణించరు.

భారతదేశంలో చంద్రగ్రహణం ప్రభావం:  భారతదేశంలో మొదటి చంద్రగ్రహణం చెల్లుబాటు కానందున, దాని సూతక కాలం కూడా చెల్లుబాటు కాబోదని మీకు తెలియజేద్దాం. అలాగే, ఈ చంద్రగ్రహణం యొక్క శుభ లేదా అశుభ ప్రభావం భారతదేశంలో కూడా కనిపించదు.

చంద్రగ్రహణం అంటే ఏమిటి? భూమికి, చంద్రునికి మధ్య సూర్యుడు వచ్చినప్పుడల్లా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు.. భూమి, చంద్రుడు ఒక సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈసమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రగా కనిపిస్తాడు. చంద్రుడు.. సూర్యుని మధ్యలోకి భూమి వచ్చినప్పుడు చంద్రుడిపై కొద్దిగా నీడ పడుతుంది. అప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Weather Alert: తెలంగాణలో వర్ష బీభత్సం.. అకాల వర్షానికి అన్నదాత విలవిల.. నేడు, రేపు భారీ వర్షాలు

Fish Festival: చేపలు పట్టే పండుగలో భారీగా పాల్గొన్న గ్రామస్తులు.. పోటీపడి చేపట్టిన జనం..