Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: తిరుమలలో వైభవోపేతంగా చక్రస్నానం క్రతువు

TTD Brahmotsavam 2024: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం నాడు చక్రస్నానంను వైభవోపేతంగా నిర్వహించారు. చక్రస్నానం క్రతువులో పాలుపంచుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించారు.

Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 12, 2024 | 6:23 PM

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం నాడు చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. చక్రస్నానం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి శ్రీవారి పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు సుదర్శన చక్రానికి స్నానం క్రతువు నిర్వహించారు. అంతకు ముందు మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణి జలంలో ముంచి, స్నానం చేయించారు. చక్రస్నానం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

తిరుమలలో వైభవంగా చక్రస్నానం..

శనివారం రాత్రి ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈసారి వాహన సేవలను 15 లక్షల మంది భక్తులు వీక్షించినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాకు తెలిపారు. గరుడ సేవ ఒక్కరోజు.. మూడున్నర లక్షల మంది భక్తులు వీక్షించినట్లు తెలిపారు. టీటీడీ ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తపరిచారని తెలిపారు. లడ్డూల నాణ్యతపై భక్తులు స్వచ్ఛందంగా సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో 30 లక్షల లడ్డూల పంపిణీ చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సలహాల మేరకు ఏర్పాట్లను మెరుగుపరిచామని వివరించారు. బ్రహ్మోత్సవాల సమయంలో 6 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో రూ. 26 కోట్లు హుండీ ద్వారా ఆదాయం వచ్చిందని వెల్లడించారు.