YV Subba Reddy: కశ్మీర్‌లో శ్రీవారి ఆలయ పనులు వేగవంతం.. ఉత్తరాదిలో మరిన్ని ఆలయాలు నిర్మిస్తామంటున్న టీటీడీ ఛైర్మన్

Surya Kala

Surya Kala |

Updated on: Apr 07, 2022 | 1:12 PM

TTD YV Subba Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthaanm) ఢిల్లీ(Delhi) సలహామండలి ఛైర్మన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి(Vemireddy Prasanthi Reddy) ఆధ్వర్యంలో..

YV Subba Reddy: కశ్మీర్‌లో శ్రీవారి ఆలయ పనులు వేగవంతం.. ఉత్తరాదిలో మరిన్ని ఆలయాలు నిర్మిస్తామంటున్న టీటీడీ ఛైర్మన్
Subba Reddy In Delhi

TTD YV Subba Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthaanm) ఢిల్లీ(Delhi) సలహామండలి ఛైర్మన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి(Vemireddy Prasanthi Reddy) ఆధ్వర్యంలో టీటీడీ ఢిల్లీ దేవాలయ కమిటీ నియామకం జరిగింది. స్థానిక సలహా కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సేవలను దేశరాజధాని ఢిల్లీ తో పాటు , ఉత్తర భారత దేశంలో విస్తృతం చేయడానికి కమిటీ సహాయపడుతుందని ప్రశాంతి చెప్పారు. ఢిల్లీ ఆలయంలో వాస్తు నిపుణులు సూచించినట్లు మార్పులు చేయాలని నిర్ణయించామని అన్నారు. మే నెలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని తాము భావిస్తున్నామని.. ఈ మేరకు ధర్మప్రచార వాహనం ఏర్పాటు చేసి స్వామివారి ప్రచారం నిర్వహించనున్నామని తెలిపారు. ఈ స్థానికస్థానిక సలహా మండలి చైర్మన్, సభ్యులు ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో టిటిడి ఆలయ కార్యక్రమాలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు.

ఈ సందర్భంగా  టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. జమ్మూ- కాశ్మీర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ సంవత్సరం అక్టోబర్- నవంబర్ కల్లా ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ఉత్తర భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో మరిన్ని స్వామివారి ఆలయాలు నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఢిల్లీ టిటిడి ఆలయంలో టిటిడి ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, స్థానిక సలహా సంఘం అధ్యక్షురాలు, ఉత్తర భారత టిటిడి ఇంచార్జి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఏ.ఇ.ఓ ఎవి ధర్మారెడ్డి సమక్షంలో స్థానిక సలహా మండలి సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఢిల్లీ టిటిడి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో  టిటిడి ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Also Read: Viral Video: బస్సుపై ఏనుగు దాడి.. డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం.. మిస్టర్ కూల్ అంటూ డ్రైవర్‌కు కితాబు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu