Viral Video: బస్సుపై ఏనుగు దాడి.. డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం.. మిస్టర్ కూల్ అంటూ డ్రైవర్‌కు కితాబు
Viral Video: ఏనుగు ప్రయాణీకులతో వెళ్తున్న ఓ బస్సుమీదకు దూసుకుని వెళ్లి.. ఆ బస్సు అద్దాలను పగలగొట్టింది. అయితే బస్సు డ్రైవర్ చాకచక్యంతో తీవ్ర ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన..
Viral Video: ఏనుగు ప్రయాణీకులతో వెళ్తున్న ఓ బస్సుమీదకు దూసుకుని వెళ్లి.. ఆ బస్సు అద్దాలను పగలగొట్టింది. అయితే బస్సు డ్రైవర్ చాకచక్యంతో తీవ్ర ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Media)లో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన కేరళ(kerala)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మున్నార్‌లో ఓ అడవి ఏనుగు రోడ్డుమీద వెళ్తున్న బస్సు వైపు దూసుకుని వెళ్ళింది. అంతేకాదు బస్సు ముందు అద్దాన్ని పగలగొట్టింది కూడా.. అయితే ఈ ఏనుగు రోడ్డుపై వాహనాలపై దాడి చేయడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి అని నివేదికలు పేర్కొన్నాయి. గతంలో, మున్నార్ సమీపంలోని కన్నన్ దేవన్ టీ తోటల కింద కదలార్ ఎస్టేట్ వద్ద దారికి అడ్డంగా వచ్చిన ట్రాక్టర్‌ను పడయప్ప తోసాడు. ఈ అడవి ఏనుగును స్థానికులు ‘పడయప్ప’ అని పిలుస్తారు. కేరళ మున్నార్, బుధవారం సాయంత్రం KSRTC బస్సుపై దాడి చేసి .. బస్సు విండ్‌షీల్డ్ అద్దాన్ని పగులగొట్టింది. ఏనుగు అక్కడ తీవ్ర భయాందోళనను సృష్టించింది. 50 మంది ప్రయాణికులతో ఉన్న బస్సు మున్నార్ నుంచి ఉడుమల్‌పేటకు వెళ్తుండగా వడయప్ప దాడి చేసిందని సమాచారం. ఈ ఘటన కెమెరాలో చిక్కింది. అనంతరం ఈ వీడియో ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ట్విట్టర్‌లో షేర్ చేశారు. డ్రైవర్ ప్రశాంతంగా ఉండి పరిస్థితిని చక్కదిద్దారని నెటిజన్లు ప్రశంసించారు. సాహు అతన్ని ‘మిస్టర్. కూల్’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
Don’t know who is the driver of this Government Bus but he is certainly Mr Cool ?The way he handled the supervision check by Mr Elephant it was like bussiness as usual between them. ? video shared by K.Vijay #elephants #noconflict pic.twitter.com/WHxQStNv7K
— Supriya Sahu IAS (@supriyasahuias) April 6, 2022
ఈ బస్సు డ్రైవర్ ఎవరో తెలియదు కానీ అతను ఖచ్చితంగా మిస్టర్ కూల్. అతను మిస్టర్ ఎలిఫెంట్ ని అదుపు చేస్తూ.. సంఘటనను అదుపులోకి తీసుకొచ్చిన విధానం అద్భుతం అని అన్నారు. ఏనుగు ను తప్పించి బస్సు ను, అందులోని ప్రయాణీకులను సురక్షితంగా అక్కడ నుంచి డ్రైవర్ తీసుకుని వెళ్లిన తీరుకి నెటిజన్లు ఫిదా. ఇక ఈ వడయప్ప డ్డుపై వాహనాలపై దాడి చేయడం వారం వ్యవధిలో ఇది రెండో సారి అని నివేదికల ద్వారా తెలుస్తోంది. గతంలో మున్నార్ సమీపంలోని కన్నన్ దేవన్ టీ తోటల కింద కదలార్ ఎస్టేట్ వద్ద దారికి అడ్డంగా వచ్చిన ట్రాక్టర్‌ను పడయప్ప నెట్టి కిందకు పడేశాడు.
Also Read: Pakistan Drone: ఇండో-పాక్ సరిహద్దులో పాక్ డ్రోన్ కలకలం.. భద్రతా దళాల కాల్పులతో పరార్!