Brahmamgari Matam: రోజుకో మలుపు తిరుగుతున్న బ్రహ్మంగారి మఠం వివాదం.. ధార్మిక పరిషత్‌, దేవాదాయశాఖకు చేరిన పంచాయితీ

ఏపీలోని శ్రీపోతులూరి బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతి ఎంపిక బాధ్యత ఇక ధార్మిక పరిషత్‌, దేవాదాయశాఖకు వెళ్లింది. జులై చివరి వారంలో దీనిపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

Brahmamgari Matam: రోజుకో మలుపు తిరుగుతున్న బ్రహ్మంగారి మఠం వివాదం.. ధార్మిక పరిషత్‌, దేవాదాయశాఖకు చేరిన పంచాయితీ
Brahmamgari Matam Peetadhipathi Controversy
Follow us

|

Updated on: Jun 24, 2021 | 12:28 PM

Brahmamgari Matam Peetadhipathi Controversy: ఏపీలోని శ్రీపోతులూరి బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతి ఎంపిక బాధ్యత ఇక ధార్మిక పరిషత్‌, దేవాదాయశాఖకు వెళ్లింది. జులై చివరి వారంలో దీనిపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మఠం వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మఠం మేనేజర్‌ ఈశ్వరాచారి ఆకస్మిక సెలవుపై వెళ్లారు. నేటి నుంచి నెల రోజుల పాటు సెలవు పెట్టి వెళ్లారు ఈశ్వరాచారి.

రోజులు గడిస్తున్న కొలిక్కిరాని బ్రహ్మంగారి మఠం వ్యవహారాలను చక్కబెట్టేందుకు ప్రత్యేక అధికారిని నియమించింది ఏపీ దేవాదాయశాఖ. దీంతో రెండు రోజుల పాటు బ్రహ్మంగారి మఠాన్ని సందర్శిస్తారు దేవాదాయశాఖ జాయింట్‌ కమిషనర్‌ ఆజాద్‌. పీఠాధిపతి ఎంపికపై చర్యలు తీసుకుంటారు ఆజాద్‌. పీఠాధిపతి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య ఇంకా సయోధ్య కుదరడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారి ఆజాద్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మఠంలో అవినీతి, అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తడంతో రికార్డులను పరిశీలించనున్నారు. మరోవైపు పీఠాధిపతి ఎవరు ఉండాలనే దానిపై జులై నెల చివర్లో ధార్మిక పరిషత్‌ భేటీ అవుతుంది. 13 మంది మఠాధిపతులతో కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపికపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఫోకస్‌ పెట్టారు. వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి ఇద్దరి భార్యల సంతానంతో ఇప్పటికే చర్చలు జరిపారు మంత్రి వెల్లంపల్లి. మఠం ప్రతిష్ట దిగజారకుండా ఏదో ఒకటి తేల్చుకోవాలని మూడు రోజులు గడువు ఇచ్చారు. ఆ డెడ్‌లైన్‌ కాస్తా ముగిసింది. దీంతో ధార్మిక పరిషత్‌ , దేవాదాయశాఖ జోస్యం చేసుకోవాల్సి వచ్చింది. పీఠాధిపతిగా నేనే అర్హుడినంటున్నారు వెంకటాద్రి స్వామి. వీలునామా ప్రకారం తనకే పీఠాధిపతి పదవి ఇవ్వాలన్నారు. మరోవైపు, తానే సంరక్షకురాలిగా ఉంటానని చెబుతున్నారు వసంత వెంకటేశ్వరస్వామి రెండో భార్య మారుతీ మహాలక్ష్మి. దీంతో పీఠాధిపతి ఎంపిక పీఠముడిగా మారింది. ఇప్పుడు ధార్మిక పరిషత్‌, దేవాదాయశాఖ ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

మరోవైపు, పీఠాధిపతి నియామకాన్ని త్వరగా తేల్చాలని ధార్మిక పరిషత్‌ను రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి ఆదేశించారు. దీంతో పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ కోసం ప్రత్యేక అధికారిగా దేవాదాయశాఖ జాయింట్‌ కమిషనర్‌ను నియమించింది ధార్మిక పరిషత్‌. అయితే, పీఠాధిపతులతో సమావేశం నిర్వహించాలని మంత్రి వెల్లంపల్లి ఆదేశించారు. దీంతో ఎంపిక ప్రక్రియ మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

Read Also….  Simhachalam Priest: సింహాచలంలో అర్చకుల మధ్య ఆధిపత్య పోరు.. మార్ఫింగ్‌ వీడియో కలకలం.. బాధ్యులపై చర్యలకు వేద పండితుల డిమాండ్