Bhagavad Gita: మనుషుల కోపానికి కారణం ఇదేనట.. శ్రీకృష్ణుడు చెప్పిన అద్భుతమైన సూచనలు..
ఒక వ్యక్తి సన్మార్గంలో, ధర్మంతో కూడిన జీవనం సాగించడానికి మార్గాన్ని చూపే ఏకైక గ్రంధం శ్రీమద్ భగవద్గీత. గీత జీవితంలో ధర్మం, కర్మ, ప్రేమ పాఠాలను బోధిస్తుంది.
ఒక వ్యక్తి సన్మార్గంలో, ధర్మంతో కూడిన జీవనం సాగించడానికి మార్గాన్ని చూపే ఏకైక గ్రంధం శ్రీమద్ భగవద్గీత. గీత జీవితంలో ధర్మం, కర్మ, ప్రేమ పాఠాలను బోధిస్తుంది. భగవద్గీత జ్ఞానం వ్యక్తి జీవితానికి ఎంతో ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. గీతలోని సారాంశాన్ని అవగతం చేసుకుని, ఆ సూచనల ప్రకారం జీవించే వ్యక్తి జీవితం ఆదర్శప్రాయంగా ఉంటుంది. శ్రీమద్ భగవద్గీతలోశ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో పాండవరాజు అర్జునుడికి చేసే ఉపదేశాలు ఉన్నాయి. అమూల్యమైన ఈ ఉపదేశాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆచరణీయమైనవిగా పరిగణించడం జరిగింది. ఉత్తమ జీవనానికి ఇది మార్గాన్ని నిర్దేశిస్తుంది. ‘గీత’ లోని వ్యాఖ్యాలను అర్థం చేసుకుని, అనుసరించడం ద్వారా జీవితంలో ఎంతో ఉన్నతి పొందుతారు. అయితే, గీతలో వ్యక్తి కోపానికి సంబంధించి శ్రీకృష్ణుడు కీలక ప్రస్తావన చేశారు. కోపానికి గల కారణాలను వివరించారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
శ్రీకృష్ణుడి అమూల్యమైన బోధనలు..
1. మనసులోని బాధను స్పష్టంగా చెప్పలేని వారికే ఎక్కువ కోపం వస్తుందని శ్రీకృష్ణుడు తన భోనల్లో పేర్కొన్నారు. అయితే, భగవంతుడిని ప్రార్థించడం ద్వారా మనిషి విధిరాత మారుతుందని అన్నారు.
2. గీత ప్రకారం.. మనిషి తన మనస్సుపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. మనం దానిని నియంత్రించుకోకపోతే మన మనస్సు మనకే శత్రువులా పనిచేస్తుంది.
3. గీత ప్రకారం.. ఒకరి పరిస్థితి బాగోలేనప్పుడు చూసి నవ్వొద్దు. ఎందుకంటే.. ఆ చెడు కాలం నవ్వేవారి ముఖాలను గుర్తుంచుకుంటుంది. మీరు ఇష్టపడే వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. పరీక్షించడానికి కాదు అని శ్రీకృష్ణుడు తన బోధనల్లో పేర్కొన్నారు.
4. మనిషి ఎప్పుడూ అహంకారంతో వ్యవహరించకూడదని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. అహం మనిషిని హానీ తలపెడుతుంది. చివరికి ఆ అహంకారమే వారి నాశనానికి కారణం అవుతుంది. కావున, వీలైనంత వరకు అహాన్ని దరిచేరనివ్వకండి.
5. వీలైతే ఇతరులు సాయం చేయాలి తప్ప.. నష్టం చేకూర్చే పనులు చేయకూడదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అని, అలాంటి పరిస్థితి తిరిగి మీక్కూడా రావొచ్చునని భగవద్గీతంలో పేర్కొనడం జరిగింది.
గమనిక: ప్రజల సాధారణ విశ్వాసాలను దృష్టిలో ఉంచుకుని భగవద్గీతలో పేర్కొన్న అంశాల ఆధారంగా ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..