AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bathroom Vastu: బాత్రూమ్‌కు సంబంధించిన వాస్తు దోషాలా.. జీవితంలో పేదరికం, బాధలను తెస్తుందని తెలుసా..

బాత్రూంలో వస్తువులను తప్పుడు దిశలో ఉంచడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. స్నానాల గదికి సంబంధించిన కొన్ని ఖచ్చితమైన వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం.. వాస్తు ప్రకారం బాత్రూంలో అద్దాన్ని సరైన దిశలో ఉంచడం అవసరం. బాత్రూంలో ఏర్పాటు చేసిన అద్దాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపున ఉంచాలని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూలత దూరమవుతుంది. అంతే కాకుండా టాయిలెట్ సీటు పడమర లేదా వాయువ్య దిశలో ఉండాలని గుర్తుంచుకోండి.

Bathroom Vastu: బాత్రూమ్‌కు సంబంధించిన వాస్తు దోషాలా.. జీవితంలో పేదరికం, బాధలను తెస్తుందని తెలుసా..
Bathroom Vastu
Surya Kala
|

Updated on: Nov 20, 2023 | 8:43 PM

Share

ఇంట్లో వాస్తును అనుసరించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. ఆర్థిక శ్రేయస్సు కూడా ఉంటుంది. వాస్తు ప్రకారం బాత్రూమ్‌కు సంబంధించిన వాస్తును అనుసరించడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. బాత్రూమ్, టాయిలెట్ ఏర్పాటు చేసుకునే దిశలో తేడా ఉంటే ఇంటి ప్రతికూలతను పెంచుతుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఎవరైనా సరే సరైన వాస్తును పాటించకపోతే అది  జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. ఆర్థికంగా కూడా బలహీనంగా మారతారు. బాత్రూంలో వస్తువులను తప్పుడు దిశలో ఉంచడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. స్నానాల గదికి సంబంధించిన కొన్ని ఖచ్చితమైన వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం..

వాస్తు ప్రకారం బాత్రూంలో అద్దాన్ని సరైన దిశలో ఉంచడం అవసరం. బాత్రూంలో ఏర్పాటు చేసిన అద్దాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపున ఉంచాలని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూలత దూరమవుతుంది. అంతే కాకుండా టాయిలెట్ సీటు పడమర లేదా వాయువ్య దిశలో ఉండాలని గుర్తుంచుకోండి.

బాత్రూంలో ఫ్లోరింగ్ కోసం ఉపయోగించే టైల్స్ రంగు ఎల్లప్పుడూ తేలికగా ఉండాలి. వీలైతే, క్రీమ్ లేదా తెలుపు రంగు టైల్స్ ను ఇన్స్టాల్ చేయండి. వాస్తు ప్రకారం లేత రంగు ప్రతికూల శక్తులను తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

వాస్తు ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్ లేదా టబ్‌ని ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. బాత్ రూమ్ లోని బకెట్ ను ఉపయోగించకపోయినా.. బకెట్లో సగం నీటితో నింపండి. బకెట్ ఖాళీగా ఉంటే, దానిని తలక్రిందులుగా ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం ఉంటాయి.

ఇంట్లో ఏర్పాటు చేసిన ఏదైనా కుళాయి నుండి నీరు కారుతూ ఉంటే. అది శుభప్రదంగా పరిగణించబడదు. వాస్తు ప్రకారం ఇలా టాప్ నుంచి నీరు కారుతుంటే ఇంట్లో నివసించే వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంటి యజమాని ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటాడు. కనుక వెంటనే అటువంటి విషయంలో    మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు