Ayodhya Temple: రామ్ లల్లా పూజకు తుది దశకు చేరుకున్న అర్చకుల ఎంపిక ప్రక్రియ.. ప్రవర్తనా నియమావళి రూపొందిస్తున్న ట్రస్ట్..
రామయ్య విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవానికి సమయం ఆసన్నమైంది. మరోవైపు పూజాది వైదిక ఉత్సవాల నిర్వహణ కోసం అర్చకుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. అర్చక పరీక్షకు 3వేలకు పైగా దరాఖాస్తుల వచ్చాయి. 225 మందిని ఎంపికయ్యారు. మరోవైపు రామాలయంలో పూజా నియమావళి ఎలా ఉండాలనే దానిపై నియమాలు రూపొందిస్తున్నారు.
అయోధ్య రామాలయం సర్వాంగసుందరంగా ముస్తాబబుతోంది. వచ్చే ఏడాది జనవరి 22న రామ్ లల్లా విగ్రహా మహాప్రతిష్టాపన మహోత్సవం .ప్రధాని సహా సకల జనులకు సాదర ఆహ్వానం పలికింది శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు . జనవరి 22 మధ్యాహ్నా 12.20 గంటలకు మృగశిర నక్షత్రంలో అభిజీత్ ముహూర్తంలో రామ్ లల్లా విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుంది. మరోవైపు అయోధ్యలో పూజాది వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం అర్చకుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కులమతాలకు సంబంధం లేకుండా అర్చకుల రామసేవలో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు.
6నెలల దీక్ష
రామనంది సంప్రదాయంలో కనీసం ఆరు నెలల పాటు దీక్షలు చేసి గురుకుల విద్యా విధానంలో చదివి ఉండడమే అర్హత. మరే ఇతరత్రా నిబంధనలు విధించలేదు. ఐతే అయోధ్య పరిసర ప్రాంతాల అభ్యర్థులకు ప్రాధాన్యత వుంటుందని పేర్కొన్నారు. నోఫికేషన్ ప్రకారం 6నెలల దీక్ష..గురుకుల విద్యను అభ్యసించిన 20 నుంచి 30 ఏళ్ల వయసు వున్నవాళ్లు 3వేల మందికిపైగా ఆన్‌లైన్‌లో దరాఖస్తు చేసుకున్నారు.
శ్రీరామ సేవా విధి విధాన సమితి
ప్రవేశ పరీక్ష ద్వారా 225 మంది అభ్యర్థులను పారదర్శకంగా ఎంపిక చేశారు. వీరికి ఆరు నెలల పాటు ఆగమ శాస్త్ర శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు నెలకు రూ.2,000 స్టైఫండ్తో పాటు ఉచిత వసతి కల్పిస్తారు. శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు ట్రస్ట్ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. అయోధ్యలో పూజలు, వైదిక ఉత్సవాల నిర్వహణ కోసం శ్రీరామ సేవా విధి విధాన సమితిని ఏర్పాటు చేయనున్నారు. నిత్య సేవలు, ప్రత్యేక ఉత్సవాలు సహా వైదిక విధివిధానాలపై శాస్త్రోక్తంగా అర్చకులు తర్ఫీదునిస్తారు.
పూజా నియమావళి
రామ్ లల్లా ఆలయంలో పూజా నియమావళి ఎలా ఉండాలనే దానిపై నియమాలు రూపొందిస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ మందిరంలో జరిగే పూజకు సంబంధించిన నియమాలు, ప్రవర్తనా నియమావళి, నిత్యకృత్యాలను సిద్ధం చేస్తోంది. ప్రవర్తనా నియమాలను రూపొందించడానికి ఏర్పాటు చేసిన మతపరమైన కమిటీ రెండు రోజుల సమావేశం ముగిసింది. సమావేశంలో నిబంధనలపై సభ్యులు గంటల తరబడి మేధోమథనం చేశారు. కొత్త రామమందిరంలో ఐదుసార్లు రామలల్లా ముందు హారతి నిర్వహించాలని నిర్ణయించారు.
పూజ, అలంకారం
ఇతర పూజా నియమాలపై సమావేశంలో చర్చించారు. కొత్త ఆలయంలో రామనంది సంప్రదాయం ప్రకారం పూజా విధానం ఉంటుంది. పూజా ఆచారాలు అలక్రాణ, పండుగ, ఇతర ప్రత్యేక సందర్భాలలో నైవేద్యం, అలంకరణ ఎలా చేయాలి అనే విషయాలన్నీ చర్చించారు. ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి నాడు శ్రీరాముడికి ఏ విధమైన నైవేద్యం పెట్టాలనే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నారు.
మకర సంక్రాంతి, హోలీ, రామనవమి, కార్తీక పరిక్రమ వంటి పండుగలను ఎలా, ఏ రూపంలో జరుపుకోవాలో అనే విషయంపై ప్రవర్తనా నియమావళిని రూపొందిస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..