Vastu Tips: ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం తెచ్చే జమ్మి మొక్క పెంచడానికి నియమాలున్నాయని తెలుసా.. !
ఇంట్లో శమీ మొక్క ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెబుతారు. అయితే ఇంటి ఆవరణలో శమీ వృక్షానికి సంబంధించి కొన్నిసూచనలను పురాణ గ్రంధాల్లో పేర్కొన్నారు. వీటిని పాటించడం చాలా ముఖ్యం.. ఈ రోజు జమ్మి చెట్టుకు సంబంధించిన కొన్ని నియమాలు గురించి తెలుసుకుందాం.. జమ్మి చెట్టు ఆవరణలో పొరపాటున కూడా బూట్లు, చెప్పులు పెట్టకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల శని దేవుడికి కోపం వస్తుంది.

సనాతన ధర్మంలో ప్రతి దాని వెనుక ఒక కథ, ప్రాముఖ్యత ఉంటుంది. శమీ వృక్షం అంటే జమ్మి వృక్షంలో కూడా అలాగే ఉంది. శమీ వృక్షాన్ని శనిదేవుని చిహ్నంగా భావిస్తారు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శమీ వృక్షం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో శమీ మొక్క ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెబుతారు. అయితే ఇంటి ఆవరణలో శమీ వృక్షానికి సంబంధించి కొన్నిసూచనలను పురాణ గ్రంధాల్లో పేర్కొన్నారు. వీటిని పాటించడం చాలా ముఖ్యం.. ఈ రోజు జమ్మి చెట్టుకు సంబంధించిన కొన్ని నియమాలు గురించి తెలుసుకుందాం..
- శుభ్రమైన ప్రదేశంలో జమ్మి చెట్టు : జమ్మి చెట్టు ఆవరణలో పొరపాటున కూడా బూట్లు, చెప్పులు పెట్టకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల శని దేవుడికి కోపం వస్తుంది. అటువంటి వారు శనిదేవుని ఆగ్రహానికి గురవుతారు. అందువల్ల, జమ్మి మొక్కను శుభ్రమైన ప్రదేశంలో నాటండి లేదా జమ్మి చెట్టు నాటిన స్థలం దగ్గర శుభ్రంగా ఉంచండి.
- తులసి మొక్కకు దూరంగా జమ్మి మొక్క: హిందూ సనాతన ధర్మంలోని విశ్వాసాల ప్రకారం జమ్మి చెట్టు ఈశ్వరుడికి చాలా ప్రియమైనది. అయితే శివారాధనలో తులసి నిషిద్ధం. కనుక ఎటువంటి పరిస్థితులు వచ్చినా పొరపాటున కూడా శమీ వృక్షం దగ్గర తులసి మొక్కను నాటకూడదు.
- జమ్మి మొక్కకు రోజూ నీటిని అందించండి.
- పొరపాటున కూడా శమీ మొక్కను దక్షిణ దిశలో నాటకండి.
- ఇంటి ప్రధాన ద్వారం దగ్గర శమీ మొక్కను నాటడం శుభప్రదంగా భావిస్తారు.
- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శమీ మొక్కను ఎల్లప్పుడూ తూర్పు లేదా ఈశాన్య దిశలో నాటాలి.
- శమీ మొక్క ముందు రోజూ నువ్వుల నూనె దీపం వెలిగించడం శుభ ఫలితాలను ఇస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు








