Ayodhya: అయోధ్యలో రామాలయం కోసం 32 ఏళ్లుగా మౌనం.. ఈనెల 22న మౌనం వీడనున్న కలియుగ శబరి

|

Jan 11, 2024 | 2:21 PM

ఈ నెల 22వ తేదీన రామ మందిర ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న రామ భక్తులు సంబరాలు జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. అంతేకాదు అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం అలనాటి శబరిలా ఎదురుచూస్తున్న 85 ఏళ్ల వృద్ధురాలు తన మౌనాన్ని కూడా వీడనున్నారు. బాల రామయ్య తన ఇంట్లో కొలువుదీరే సమయంలో ఈ కలియుగ శబరి 32 ఏళ్ల నుంచి పాటిస్తున్న మౌనాన్ని రామ నామ జపంతో వీడనున్నారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలనేది ఈ బామ్మ కల..

Ayodhya: అయోధ్యలో రామాలయం కోసం 32 ఏళ్లుగా మౌనం.. ఈనెల 22న మౌనం వీడనున్న కలియుగ శబరి
Saraswati Devi
Follow us on

రామ జన్మ భూమి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోట్లాది హిందువుల కల. సుమారు 500 ఏళ్లుగా ఎందరో తమ ప్రాణాల సైతం త్యాగం చేశారు. ఆ కల తీరే సమయం ఆసన్నం అవుతోంది. ఈ నెల 22వ తేదీన రామ మందిర ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న రామ భక్తులు సంబరాలు జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. అంతేకాదు అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం అలనాటి శబరిలా ఎదురుచూస్తున్న 85 ఏళ్ల వృద్ధురాలు తన మౌనాన్ని కూడా వీడనున్నారు. బాల రామయ్య తన ఇంట్లో కొలువుదీరే సమయంలో ఈ కలియుగ శబరి 32 ఏళ్ల నుంచి పాటిస్తున్న మౌనాన్ని రామ నామ జపంతో వీడనున్నారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలనేది ఈ బామ్మ కల.. ఆ కల నెరవేరడంతో జార్ఖండ్‌కు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు తన మూడు దశాబ్దాల మౌనాన్ని వీడనున్నారు. వివరాల్లోకి వెళ్తే..

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ కి చెందిన సరస్వతీ దేవిని ‘మౌని మాత’ అని ముద్దుగా పిలుచుకుంటారు. 1992లో అయోధ్యలో కరసేవ సమయంలో బాబ్రీ మసీదు కూల్చివేసి రోజున ఆమె తాను అయోధ్యలో రామాలయం నిర్మించిన రోజున మాత్రమే తిరిగి మాట్లాడతాను అంటూ గంభీరమైన ప్రతిజ్ఞ చేశారు. గత 32 ఏళ్లుగా ఆమె మౌనాన్ని పాటిస్తూనే ఉన్నారు. ఆమె కల తీరుతున్న వేళ.. తన ప్రతిజ్ఞకు ముగింపు పలకనున్నారు. ఆమె మౌన వ్రతం జనవరి 22న రామ మందిర ప్రతిష్ఠాపన శుభదినాన ముగియనుంది.

సరస్వతీ దేవి మౌనీ మాత మందిర ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు సోమవారం రాత్రి రైలులో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు వెళ్లనున్నారు. నలుగురు కుమార్తెలతో సహా ఎనిమిది మంది పిల్లల తల్లి. సరస్వతి దేవి భర్త దేవకినందన్ అగర్వాల్  1986లో మరణించారు. అప్పటి నుంచి ఆమె జీవితాన్ని రాముడికి అంకితం చేసింది. రామ నామ స్మరణతోనే జీవిస్తుంది. ఎక్కువ సమయం తీర్థయాత్రల్లో గుడుతున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

సరస్వతీ దేవి కొడుకు భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్‌లో అధికారి అయిన నంద్ లాల్ అగర్వాల్‌తో కలిసి నివసిస్తోంది. ఆమె తన కుటుంబంతో సంకేత భాషను ఉపయోగించి, కాగితం మీద పెన్ను తో రాసి ఇతరులతో సంభాషిస్తుంది.

ఆమె చిన్న కుమారుడు హరేరామ్ అగర్వాల్ (55) మాట్లాడుతూ 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు  ధ్వంసమైనప్పుడు అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించే వరకు మాట్లాడనని తన తల్లి ప్రతిజ్ఞ చేసిన సంగతి గుర్తు చేసుకున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..