Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Mandir: భాగ్యనగరం నుంచి అయోధ్యకు పాదుకలు.. దీని విలువ ఎంతో తెలుసా..

దేశ వ్యాప్తంగా అందరి చూపు అయోధ్య రామ మందిరంపైనే ఉంది. దాదాపు వందల సంవత్సరాల కల సాకారమౌతున్న వేళ శ్రీరాముని భక్తులు వివిధ రకాలుగా తమ భావనను చూపిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన 64 ఏళ్ల వ్యక్తి చల్లా శ్రీనివాస్ శాస్త్రి, దేవుడికి బంగారు పూత పూసిన జత చెప్పులను సమర్పించడానికి అయోధ్యకు కాలినడకలన వెళ్లేందుకు సంకల్పించారు. దాదాపు 7,200 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించారు.

Ram Mandir: భాగ్యనగరం నుంచి అయోధ్యకు పాదుకలు.. దీని విలువ ఎంతో తెలుసా..
Ayodhya Ram Temple
Follow us
Srikar T

|

Updated on: Jan 11, 2024 | 1:56 PM

దేశ వ్యాప్తంగా అందరి చూపు అయోధ్య రామ మందిరంపైనే ఉంది. దాదాపు వందల సంవత్సరాల కల సాకారమౌతున్న వేళ శ్రీరాముని భక్తులు వివిధ రకాలుగా తమ భావనను చూపిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన 64 ఏళ్ల వ్యక్తి చల్లా శ్రీనివాస్ శాస్త్రి, దేవుడికి బంగారు పూత పూసిన జత చెప్పులను సమర్పించడానికి అయోధ్యకు కాలినడకలన వెళ్లేందుకు సంకల్పించారు. దాదాపు 7,200 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించారు. జనవరి 22 న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ముందే అతను అయోధ్యకు చేరుకోవాలనుకుంటున్నారు. అందుకోసమే అయోధ్య-రామేశ్వరం మార్గాన్ని ఎంచుకున్నారు. గతంలో శ్రీరాముడు తన ‘వనవాసం’ సమయంలో అనుసరించిన మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే శ్రీరాముడు అయోధ్య నుంచి రామేశ్వరం చేరుకుంటే.. శాస్త్రి మాత్రం శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామేశ్వర లింగాన్ని దర్శించి జులై 20న తన నడకను ప్రారంభించానని, రివర్స్‌ ఆర్డర్‌లో యాత్ర చేపట్టాలనుకుంటున్నట్లు తెలిపారు.

జనవరి 15న అయోధ్య చేరుకోవడమే తన లక్ష్యమంటున్నారు. జనవరి 16న ఈ ‘చరణ్ పాదుక’ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి అందజేస్తానన్నారు. జనవరి 22న రామమందిరం ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకకు ముందు అయోధ్యను సందర్శించడం చాలా ఉత్సాహంగా ఉందన్నారు. రాముడి చెప్పులకు ప్రత్యేక విలువ ఉందన్నారు. రామాయణం ప్రకారం, శ్రీరాముని సోదరుడు భరతుడు రాజ్యాన్ని పాలించేందుకు గౌరవ సూచకంగా సింహాసనంపై తన అన్న శ్రీరాముని చెప్పులను ఉంచి అయోధ్యను పాలించినట్లు పురాణ ఇతిహాసాన్ని వివరించారు. శ్రీరాముడికి ఇవ్వడానికి నేను ప్రస్తుతం ‘ పంచ ధాతు ‘ అంటే ఐదు లోహాలతో తయారు చేసిన బంగారు పూతతో కూడిన ‘ పాదుకలు ‘ (పాదరక్షలు) తీసుకువెళుతున్నాను అని చెప్పారు. తమిళనాడు నుంచి రోజుకు 30 నుండి 50 కి.మీ ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. బంగారు పూత పూసిన చెప్పుల జత విలువ దాదాపు రూ. 65 లక్షలు అన్నారు. ఇందులో కొంత భాగాన్ని భక్తులు విరాళంగా ఇచ్చారని తెలిపారు. అయోధ్య భాగ్యనగర్ సీతారామ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శాస్త్రి భవిష్యత్తులో అయోధ్యలో శాశ్వతంగా స్థిరపడాలని కోరుకుంటున్నాట్లు తన అంతరంగాన్ని వివరించారు. అందులో భాగంగా అయోధ్యలోనే ఒక ఇంటిని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..