Bengaluru CEO Case: బిడ్డను చంపిన కేసులో విస్తుపోయే వాస్తవాలు! దగ్గు మందు ఇచ్చి.. పక్కా ప్లాన్‌తో మర్డర్
బెంగళూరుకు చెందిన ఏఐ స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ (39 తన నాలుగేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. నిందితురాలు సుచనా సేథ్ బస చేసిన రూంలో ఖళీ దగ్గు మందు సీసాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నారిని హత్య చేయడానికి ముందు దగ్గుమందు హెవీ డోస్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. మందు ప్రభావంతో..
బెంగళూరు, జనవరి 11: బెంగళూరుకు చెందిన ఏఐ స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ (39 తన నాలుగేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. నిందితురాలు సుచనా సేథ్ బస చేసిన రూంలో ఖళీ దగ్గు మందు సీసాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నారిని హత్య చేయడానికి ముందు దగ్గుమందు హెవీ డోస్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. మందు ప్రభావంతో చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసు వర్గాలు గురువారం (జనవరి 11) తెలిపాయి.
నిందితురాలు చిన్నారికి దగ్గు సిరప్ ఇచ్చిన తర్వాత, దిండుతో ముఖంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి, చంపిందని పేర్కొన్నారు. ఆ సమయంలో చిన్నారి విలవిల లాడినట్లు జాడ కనిపించలేదని తెలిపారు. మందు ప్రభావంతో చిన్నారి మైకంలో ఉండటం వల్ల పక్కా ప్రణాళికతో తన బిడ్డను అంతమొందించిందని పేర్కొన్నారు. దగ్గు సిరప్ బాటిల్ గురించి పోలీసులు హోటల్ సిబ్బందిని విచారించగా.. నిందితురాలు సుచనా సేథ్ తనకు దగ్గు వచ్చిందని, అవి తనవేనని చెప్పినట్లు తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదికలో చిన్నారి ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితురాలు సుచనా సేథ్‌ను మెడికల్ టెస్ట్‌ల కోసం గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అండ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ అండ్ హ్యూమన్ బిహేవియర్‌కు తరలించారు. గోవా పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆమె మాజీ భర్త వెంకటరమణకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసుపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పందిస్తూ.. కేసును లోతుగా విచారించాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.
స్టార్టప్ సీఈవో సుచనా సేథ్ తన 4 ఏళ్ల కుమారుడిని హత్య చేసిన కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితురాలు సుచనా సేథ్ చాలా కాలం క్రితమే కొడుకును హత్య చేసేందుకు ప్రణాళిక రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం కొడుకును కలిసేందుకు తండ్రి వెంకటరమణ ఇండోనేషియాలోని జకార్తా నుంచి బెంగళూరుకు వచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కొడుకు కోసం బొమ్మలు, కొత్త బట్టలు తీసుకొచ్చాడు. కానీ, మాజీ భర్త తన కొడుకును కలవడం ఇష్టంలేన సుచనా.. శనివారమే చిన్నారిని తీసుకుని గోవాకు వెళ్లిపోయింది. వెంకటరమణ ఆమెకు పలుమార్లు ఫోన్‌లు, వీడియో కాల్స్ చేసినా సమాధానం ఇవ్వలేదు. చిన్నారికి ఊపిరాడకుండా చేసి హత్య చేసిన తర్వాత, సుచనా సేథ్ తన చేతులు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కానీ ఆ ప్రయత్నం విఫలం కావడంతో.. కొడుకు మృతదేహాన్ని ఏం చేయాలో తోచక.. చివరికి సూట్‌కోసులో కుక్కి హోటల్ నుంచి కర్ణాటకకు బయల్దేరింది.
మాజీ భర్త తన కొడుకుతో మాట్లాడటం ఇష్టం లేదని సుచన విచారణలో అంగీకరించింది. కొడుకును కలిసేందుకు కోర్టు అతనికి అనుమతి ఇవ్వడంతో ఖంగుతిన్న సుచన.. భర్తపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె ఈ నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.