AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: 12 రాశులు.. 12 రకాల మనస్తత్వాలు.. ఆయా రాశుల వారి సీక్రెట్స్ మీకోసం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 12 రాశి చక్రాలు ఉన్నాయి. ఆయా రాశి చక్రాల్లో జన్మించిన వారి జాతకం ప్రకారం.. వారి వారి మనస్తత్వాలు ఉంటాయని వేద పండితులు చెబుతున్నారు. వారి ప్రవర్తన, వారిలోని అంతర్లీన శక్తులు, వారి మనత్వత్వం, వారి ఆలోచనలు, అలవాట్లు ఇలా అన్ని అంశాలపై 12 రాశుల ప్రభావం

Astrology: 12 రాశులు.. 12 రకాల మనస్తత్వాలు.. ఆయా రాశుల వారి సీక్రెట్స్ మీకోసం..
Zodiac Signs
Shiva Prajapati
|

Updated on: Apr 21, 2023 | 7:24 AM

Share

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 12 రాశి చక్రాలు ఉన్నాయి. ఆయా రాశి చక్రాల్లో జన్మించిన వారి జాతకం ప్రకారం.. వారి వారి మనస్తత్వాలు ఉంటాయని వేద పండితులు చెబుతున్నారు. వారి ప్రవర్తన, వారిలోని అంతర్లీన శక్తులు, వారి మనత్వత్వం, వారి ఆలోచనలు, అలవాట్లు ఇలా అన్ని అంశాలపై 12 రాశుల ప్రభావం కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. వేదపండితులు చెబుతున్న వివరాల ప్రకారం.. 12 రాశుల వారి మనస్తత్వాలు, వారి ఆలోచనలు ఎలా ఉంటాయో ఇవాళ మనం తెలుసుకుందాం..

మేషం మేషం: ఈ రాశి వారు ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ఇష్టపడతారు. వ్యక్తిగత లేదా బహిరంగ ప్రదేశాల్లో తాను ప్రత్యేకంగా ఉండేందుకు ఇష్టపడతాడు. మేషరాశికి సామాజిక జీవితం చాలా ముఖ్యంగా భావిస్తారు. ప్రతి విషయంలో ఓపెన్‌గా ఉంటారు.

వృషభం: ఈ రాశి వారు మంచి ఆహారం, మంచి నిద్రను ఇష్టపడతారు. వృషభరాశి వారు కుటుంబంతో ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతారు. అంటే ఇంటికి కట్టుబడి ఉంటారు. దేనిపైనా పెద్దగా ఆశ పెట్టుకోరు. చిన్నవాటితోనైనా సంతృప్తి చెందుతారు. రొటీన్‌గా ఉంటారు.

ఇవి కూడా చదవండి

మిథునం: సమాజం మధ్య జీవించడం వీరికి అలవాటు. రోజువారీ జీవితంలో అయినా, మీడియాలో అయినా, వారు ప్రజాదరణ పొందాలని కోరుకుంటారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వడానికి ఇష్టపడతారు.

కర్కాటకం: సమాచారం, గాసిప్స్ విషయంలో ఆసక్తి కనబరుస్తారు. కర్కాటక రాశి వారు తమకు తెలిసిన, తెలియని వ్యక్తుల గురించి ప్రతిదీ తెలుసుకోవాలని ఇష్టపడతారు. వారి చుట్టూ ఉన్న వ్యక్తులు, వారి జీవితాలు వారికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

సింహం: సింహరాశి వారికి ఉంటే అంతా సంపూర్ణంగా ఉంటుంది. లేదంటే అంతా శూన్యమే. వారు నిత్యం విజయానికి పోరాడుతారు. జీవితంలో విజయం సాధించడం వారికి తెలుసు. ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరిస్తారు. నేర్పరులు.

కన్య: వీరు ఏకాంతాన్ని, ఏకాంత సమయాన్ని ఇష్టపడతారు. కన్య రాశి వారు ప్రజలతో ఇట్టే మమేకం అవుతారు. కానీ, అదే సమయంలో గోప్యత కూడా పాటిస్తారు. తమ సొంత పటాలాన్ని ప్రేమిస్తారు. తమతో పాటు, ఇతరుల గురించి కూడా ఆలోచిస్తారు.

తుల: నిద్రించడం కూడా వృత్తిగా భావించే తత్వం గలవారు. తులారాశి వారు ధనవంతులు అవుతారు. ప్రశాంతతే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని వారు విశ్వసిస్తారు. ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా నిలకడగా ఉంటారు. అన్నింటినీ ఆస్వాదిస్తారు.

వృశ్చికం: ఈ రాశివారు జీవితంలో ఎల్లప్పుడూ థ్రిల్లింగ్‌గా ఉంటారు. దూకుడు స్వభావంతో, ఉత్సాహంగా ఉంటారు. అనేక విషయాల్లో ప్రావీణ్యం కలిగి ఉంటారు.

ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఆహారాన్ని ఇష్టపడతారు. వారికి ఇష్టమైన వంటకాలకు ఆస్వాదిస్తారు. వీరితో రాశితో గొడవ పడితే.. వారికి ఇష్టమైన ఆహారం తినిపించండి. వెంటనే కూల్ అవుతారు.

మకరం: ధనానికి అంకితం అవుతారు. ఇది భౌతిక పరాకాష్టకు చేరుకుంటుంది. మకర రాశి వారు ఎక్కువగా డబ్బు సంబంధిత ఇష్టపడతారు. సంపద, లగ్జరీ ఆలోచన వారిని ఆకర్షిస్తుంది.

కుంభ కుంభం: ప్రశంసలను కోరుకుంటారు. కుంభరాశి వారు చేసే సామాజిక సేవను ఇష్టపడతారు. అలాగే, ప్రజలు దానిని గుర్తించినప్పుడు, ప్రశంసించినప్పుడు, ప్రశంసలు వ్యక్తం చేసినప్పుడు వీరు సంతోషపడుతారు.

మీనం: ఈ రాశి వారికి వారి భావోద్వేగాలతో కనెక్ట్ అయ్యే సంగీతం, పాటలు వినడం ఒక రకమైన అలవాటు. పాటలు వారు చెప్పలేని ప్రతిదాన్ని చెబుతాయి. తద్వారా వారు తమ భావాలను పంచుకోగలుగుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..