IPS AB Venkateswara Rao: ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకి ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఏపీ ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్‌కు కమిషనర్‌గా జగన్ ప్రభుత్వం మంగళవారం నియమించింది. ఏబీవీని తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు నోటిఫై చేసింది. గత నెల 19 నుంచే ఆయనను విధుల్లోకి తీసుకున్నట్లు సీఎస్ సమీర్ శర్మ అబ్‌స్ట్రాక్ట్ ఇచ్చారు. ఇన్నిరోజులు స్టోర్స్ కమిషనర్‌గా ఉన్న జీ విజయ కుమార్‌ని హోంశాఖ అడిషనల్ ఇంచార్జ్‌గా నియమించారు. కాగా.. TDP ప్రభుత్వ హాయంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సమయంలో సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. దీంతో ఆయన కోర్టుల్లో పోరాటం సాగించారు.
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. సస్పెన్ష్‌ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దీనిని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీని విషయంలో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ప్రభుత్వం తిరిగి సర్వీస్ లోకి తీసుకుంది. అయితే ఇన్నిరోజులుగా పోస్ట్ మాత్రం కేటాయించలేదు. గత నెల 18న ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తేసింది ప్రభుత్వం. ఆ తర్వాతి రోజు నుంచే ఆయనకు పోస్టింగ్ ఇచ్చిన డాక్యుమెంట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ రీ ఇన్ స్టేడ్ అవుతందని తెలిపింది.
కాగా.. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలిచిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ డీజీ పోస్ట్ నుంచి తొలగించింది. 2017-18లో పోలీసు శాఖ ఆధునికీకరణ కోసం టీడీపీ ప్రభుత్వం భద్రతా పరికరాలు కొనుగోలు చేసిన వ్యవహారంలో ఏబీ అక్రమాలకు పాల్పడ్డట్లు ప్రభుత్వం ఆరోపించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..