Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andal Thiru Nakshatram: భగవంతుడి సేవలో తరించిన గోదా దేవి జీవిత చరిత్ర.. దివ్య ధనుర్మాస విశిష్టత

దివ్య ధనుర్మాసం ఇవాళ (గురువారం) ఆరంభమయ్యింది. 12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్ (గోదాదేవి) కూడా ఒకరు. ఆమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. రంగనాథుని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం.

Andal Thiru Nakshatram: భగవంతుడి సేవలో తరించిన గోదా దేవి జీవిత చరిత్ర.. దివ్య ధనుర్మాస విశిష్టత
Aandal
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 16, 2021 | 6:20 PM

Goda Devi Life Story: ‘తిరుప్పావై’ అనే మాట వినగానే గోదాదేవి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. గోదాదేవినే ‘ఆండాళ్’ అని పిలుస్తారు. ఆమెను నాచియార్ అని కూడా పిలుస్తారు.  పణ్ణిద్దరు (పన్నెండు మంది) ఆళ్వారులు పాడిన/ రచించిన పాశురాలు ’నాలాయిర (4000) దివ్య ప్రబంధం’గా, ‘ద్రవిడవేదం’గా ప్రసిద్ధి పొందాయి. ఆ ఆళ్వారులలో గోదాదేవి ఒక్కరే మహిళ. శ్రీరంగనాథుడిని భర్తగా పొందడానికి ధనుర్మాసంలో మార్గళి వ్రతాన్ని ఆచరించిన సందర్భంలో, వటపత్ర శాయిని కీర్తిస్తూ గోదాదేవి పాడిన పాశురాలు ‘తిరుప్పావై’గా నాలాయిర ప్రబంధంలో నిబద్ధమయ్యాయి. ద్రవిడ వేదానికి తిరుప్పావై హృదయం లాంటిది. మహావిష్ణువు ఆజ్ఞ మేరకు సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించింది.

శ్రీవిష్ణుచిత్తుల (పెరియాళ్వార్) ముద్దుబిడ్డగా పెరిగి, ఆండాళ్గా అందరి హృదయాలనూ దోచుకుంది. శ్రుతి, స్మృతుల మూలార్థాన్ని తేట తేట పదాలతో తమిళంలో పాశురాలుగా పాడి, ధనుర్మాస (శ్రీ) వ్రతాన్ని ఆచరించింది.

ఆనాడు గోపికలు అనంత శక్తిస్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి ‘ప్రియమైన’ చెలికాడు అనే దృష్టితో ఆరాధించారు. ఆయనను పొందగలిగారు. అదే దృష్టితో నారాయణుణ్ణి గోదాదేవి ఆరాధించింది. ఆమె శ్రీకృష్ణుణ్ణి ప్రియునిగా భావించి, నాయికా భావంతో శ్రీరంగనాయికగా ప్రకటితమైన మహిత ప్రేమమూర్తి.

వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ ఆండాళ్ తమిలనాటి శ్రీవిల్లిపుత్తూర్ లోని వటపత్రశాయి మందిర తులసి వనంలో కలియుగ ఆది లో అనగా 93 సంవత్సరం లో అవతరించినది. ఎలాగైతె జనక మహారాజుకి సీతాదేవి లభించినదో, విష్ణుచిత్తులవారికి (పెరియాల్వార్) శ్రీవిల్లిపుత్తూర్ నందనవనంలో ఆండాళ్ ఒక తులసి చెట్టు వద్ద లభించింది. తమిలంలో కోదై అనగా తులసి మాల అని అర్థం.. కాబట్టి తండ్రి ఆమెను కోదా అని పిలిచేవారు. క్రమేపి ఆపేరే గోదా గామారింది. తండ్రిపెంపకం లో ఆమె అత్యంతమైన కృష్ణ భక్తి తో పెరిగింది.

విష్ణుచిత్తులవారు ప్రతి రోజు తులసి మాలను తయారుచేసి ఒకబుట్టలో ఉంచి, తిరిగి తన కర్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ మాలను దేవాలయానికి తీసుకొనివెళ్ళి వటపత్రశాయి మూర్తికి సమర్పించేవాడు. తండ్రిగారికి తెలియకుండా ఆమె రోజు ఆ మాలను దరించి తాను భగవంతున్ని వివాహము ఆడటానికి సరిపోవునా అని అద్దంలో చూసుకొని మురిసేది.

కొద్దిరోజులకు తండ్రిగార్కి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా, గోదా ఆ మాలను దరించినదని గమనించి ఆమెను కోపించి, తనచే ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతునికి సమర్పించలేదు. ఆశ్చర్యంగా ఆరోజు స్వప్నం లో స్వామి కనిపించి ఈరోజు తులసి మాలని ఎందుకు సమర్పించలేదని అడిగుతారు.. తనకు భక్తులు తాకిన భహుమతులంటే ఇష్టం అని చెబుతారు.

ఒక్కసారిగా విష్ణుచిత్తులవారు గోదా ఒక కారణ జన్మురాలని గమనించి, నీవు మమ్మల్ని కాపాడటానికి వచ్చినావమ్మా అంటూ ఆండాళ్ అని పిలవటం మోదలుపెట్టాడు. ఆండాళ్ అంటే కాపాడటానికి వచ్చినది అని అర్థం.

అప్పటినుండి ప్రతిరోజు ఆండాళ్ దరించిన తులసిమాలనే స్వామికి సమర్పించేవాడు. గోదాదేవికి పెళ్ళి వయసు రాగానే తండ్రి వరునికై చింతించెను, కాని ఆమె కృష్ణున్ని మాత్రమే వివాహమాడుతానని పంతంతో చెప్పెను. కాని తండ్రి గారు కృష్ణుడు ఉండేది ద్వాపరంలో నందగోకులమనే ప్రాంతము అని అది చాలదూరము, కాలము కూడా వేరు అని చెప్పెను.

తాను కృష్ణుడిని కేవలం అర్చామూర్తిగానే చూడవచ్చని చెప్పెను. తండ్రిగారు వివిద దివ్యక్షేత్రాలలోని ఆయా మూర్తుల కళ్యాణగుణగణాలను కీర్తించెను. తద్వారా గోదాదేవి శ్రీరంగం లో వేంచేసి ఉన్న రంగనాయకులని వరునిగా తలచెను. శ్రీరంగనాథున్ని వివాహమాడుటకై తాను “తిరుప్పావై” మరియు “నాచియార్ తిరుమొఱ్ఱి” అనే దివ్యప్రభందాలను పాడెను.

విష్ణుచిత్తులవారికి శ్రీరంగనాథులవారు మళ్లీ స్వప్నంలో కనిపించి, నీ కుమర్తెను తనకిచ్చి వివాహం చేయటానికి చింతించవద్దని చెప్పెను, ఆమె ఎవరో కాదు భూదేవేనని చెప్పెను. అదేవిదముగా శ్రీరంగంలోని దేవాలయ పెద్దలకు కూడా స్వప్నంలో కనిపించి తన వివాహమునకై శ్రీవిల్లిపుత్తుర్ నుండి గోదాదేవిని పల్లకీలో తెమ్మని చెప్పెను. తద్వార రాజు వల్లభ దేవుని తో పాటు అందరు కలిసి గోదాదేవిని రంగనాథుని వద్దకు తెచ్చిరి. ఆమె ఆ రంగనాథున్ని వివాహమాడి సన్నిధిలో కలిసిపోయినది.

నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురంలో ఫలశృతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో అంటే 4000 పాశురాలలో గోదాదేవి పాడిన 30 పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. మార్గళి మాసంలో తిరుప్పావైలో ఉన్న మొత్తం 30 పాశురాలు రోజుకొకటి చొప్పున పారాయణం చేస్తారు.

Also Read..

Sabarimala: శబరిమల వెళుతున్నారా..? అయితే రైల్లో అలా చేయొద్దు.. భక్తులకు రైల్వే హెచ్చరిక!

Baba Vanga Predictions 2022: భూమిపై గ్రహాంతరవాసులు దండయాత్ర చేస్తారా… 2022కి వాంగబాబా జ్యోతిషం ఏం చెబుతోంది?