Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈరాశి వ్యవసాయదారులకు లాభాల పంట.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (17-12-2021):  రోజు మొదలు పెట్టె ముందు చాలామంది మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాలను చూడడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో..

Horoscope Today: ఈరోజు ఈరాశి వ్యవసాయదారులకు లాభాల పంట.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Surya Kala

|

Updated on: Dec 17, 2021 | 7:11 AM

Horoscope Today (17-12-2021):  రోజు మొదలు పెట్టె ముందు చాలామంది మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాలను చూడడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 17వ తేదీ ) శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తిరీత్యా  ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో గడుపుతారు. ఆకస్మికధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొత్త పనులను వాయిదా వేసుకోవడం మంచింది. కుటుంబ పరిస్థితులు సంతృప్తీకరంగా ఉంటాయి. ఆత్మీయుల సహకారాల కోసం ఎదురుచూడాల్సి ఉంది.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది.  కొత్త ఇంటి కొనుగోలు పై ఆసక్తిని చూపిస్తారు. నూతన  వస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులకు సంబంధిచిన సమస్యలు పరిష్కరింపబడుతాయి.  బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు  పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు కలహాలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  అనారోగ్య బాధలు అధికమవుతాయి. వ్యాపారరంగంలోనివారు జాగ్రత్తగా ఉండటం మంచిది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు  విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కొత్తపనులు వాయిదా వేసుకోవడం మంచిది. స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఎక్కువుగా చేస్తారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి  ఆకస్మిక భయాందోళనకు గురవుతారు. శారీరకంగా బలహీనంగా ఉంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వ్యవసాయదారులు లాభాలను పొందుతారు. వాయిదా వేసుకున్న పనులు పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మిక ధన లాభం పొందుతారు.  స్త్రీలు ఆనందంగా ఉంటారు. స్త్రీ వలన లాభం కలుగుతుంది. రుణబాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివావారికీ చేపట్టిన పనుల్లో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సన్నిహితులను కలుస్తారు. స్త్రీ వలన లాభం పొందుతారు. బంధు మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభవార్త వింటారు. అనుకోని ధన లాభం కల్గుతుంది. కొత్త వస్తువులను, నగలను కొనుగోలు చేస్తారు.  ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి.

మీన రాశి:  ఈరోజు ఈరాశి వారు శుభకార్యాలు చేస్తారు. ధన వ్యయం అధిగమవుతుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.  ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం.

Also Read: ఈ రోజు స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. పసిడి బాటలో పయనించిన వెండి.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ