Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga Predictions 2022: భూమిపై గ్రహాంతరవాసులు దండయాత్ర చేస్తారా… 2022కి వాంగబాబా జ్యోతిషం ఏం చెబుతోంది?

మనకు ఒక గంట తరువాత.. అంతెందుకు తరువాతి నిమిషంలో ఏమి జరుగుతుందనేది కచ్చితంగా తెలీదు. మన రెగ్యులర్ పనులు చేసుకుంటూ పోతాం. జరిగేది జరుగుతూనే ఉంటుంది.

Baba Vanga Predictions 2022: భూమిపై గ్రహాంతరవాసులు దండయాత్ర చేస్తారా... 2022కి వాంగబాబా జ్యోతిషం ఏం చెబుతోంది?
Baba Vanga Predictions 2022
Follow us
KVD Varma

|

Updated on: Dec 16, 2021 | 4:09 PM

Baba Vanga Predictions 2022: మనకు ఒక గంట తరువాత.. అంతెందుకు తరువాతి నిమిషంలో ఏమి జరుగుతుందనేది కచ్చితంగా తెలీదు. మన రెగ్యులర్ పనులు చేసుకుంటూ పోతాం. జరిగేది జరుగుతూనే ఉంటుంది. అయితే, మానవుడికి భవిష్యత్ లో ఏమి జరగబోతోంది అనే కుతూహలం చాలా ఎక్కువగా ఉంటుంది. రాబోయే రోజుల్లో.. నెలల్లో.. సంవత్సరాల్లో ఏమి జరగొచ్చు అనే అంశంపై చాలామందికి గట్టి నమ్మకాలు ఉంటాయి. కొందరు జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముకుంటారు. మన దేశంలో ఎక్కువగా పంచాంగాన్ని నమ్ముతాం. రాబోయే సంవత్సర కాలంలో ఏమి జరగొచ్చు అనేదానిని గ్రహాల కదలికల అంచనాలతో లెక్కకడతారు పంచాంగకర్తలు. ఇందులో వ్యక్తిగతంగా వారి జన్మ నక్షతాలు.. జనన రాశులు ఆధారంగా ఈ భవిష్యవాణి చెబుతారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి నమ్మకాలు చాలానే ఉన్నాయి. వాటిలో వాంగబాబా జ్యోతిషం చాలా ప్రసిద్ధి చెందింది. ఆమె చెప్పిన విషయాల్లో చాలావరకూ నిజం అయిన ఘటనలు గతంలో ఉన్నాయి. దీంతో ఆమె భవిష్యవాణిపై నమ్మకం పెంచుకున్నారు ప్రజలు. మరి 2022 సంవత్సరానికి వాంగాబాబా జ్యోతిషం ఏం చెబుతోంది? ఆమె చెప్పినట్టు భూమిపై గ్రహాంతరవాసులు దండయాత్ర చేస్తారా… అసలు వాంగబాబా జ్యోతిషం ఏమిటి? అన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం.

2022 ఏడాదిలో జరగబోయే అనర్ధాల గురించి వాంగబాబా జ్యోతిషం ఏం చెబుతోంది?

1. 2022లో ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు, సునామీ, ఇతర ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా మరియు అనేక ఆసియా దేశాలలో వరదలతో సహా ప్రకృతి వైపరీత్యాల పెరుగుదల ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 2. గ్రహాంతర దండయాత్ర. ‘ఓమువామువా’ అనే గ్రహశకలం భూమిపై జీవం కోసం వస్తుంది. అందులోని గ్రహాంతరవాసులు మన నగరాలపై బాంబులతో దాడి చేసి, మానవులను ఖైదీలుగా పట్టుకోవచ్చు. 3. సైబీరియా నుంచి ప్రాణాంతకమైన వైరస్ వస్తుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో వైరస్‌లు విజృంభిస్తాయి. 4. నీటి కొరత. జనాభా..కాలుష్యం పెరుగుతున్నందున, చాలా మంది ప్రజలు సరైన తాగునీరు కోసం కష్టపడతారు. 5. అంగారకునిపై మానవుల కాలనీ ఏర్పడుతుంది.. ఇది అణ్వాయుధ దేశంగా పెరిగి 2170 తర్వాత భూమి నుంచి స్వాతంత్రం పొందడానికి ప్రయత్నిస్తుంది 6. మిడతల దాడి భారతదేశంలో పంటలపై దాడి చేసి కరువును కలిగిస్తుంది. 7. భూ ప్రపంచంపై డ్రాగన్‌ ఆధిపత్యం సాధిస్తుంది. మానవత్వం మరచి ప్రవర్తించే ఈ డ్రాగన్‌కు వ్యతిరేకంగా మూడు పెద్ద శక్తులు. ఏకం అవుతాయి. (ఇది పక్షి బొమ్మను సూచించినా, దీని భావం డ్రాగన్‌ అంటే చైనా దేశంగా భావిస్తున్నారు) 8. ప్రజలు స్క్రీన్‌ల ముందు మరింత ఎక్కువ సమయం గడుపుతారు. చాలామంది వాస్తవ దృశ్యాలకు వర్చువల్ రియాలిటీకి మధ్య గందరగోళానికి గురౌతారు 9. వాతావరణ మార్పుల కారణంగా మానవజాతి తీవ్ర కరువు బారిన పడుతుంది. ప్రజలు బీటిల్స్, ఆకులు, మట్టిని తిని చనిపోతారు. 10. మంచుకొండల్లోని హిమనీనదాల్లో ప్రాణాంతక వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొంటారు. ఇది వేగంగా వ్యాపించి భారీగా మానవుల, జంతువుల మరణాలకు కారణమవుతుంది.

గతేడాది విశేషాలు…? 2021లో జరగబోయే సంఘటనల గురించి వాంగబాబా ఏం చెప్పారు? ఏం జరిగింది?…

  • 2021 అంతా అల్లకల్లోలమే
  • డ్రాగన్ (చైనా) ఈ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. దానికి వ్యతిరేకంగా మూడు భారీ దేశాలు ఒక్కటవుతాయి
  • ఈ ఏడాదిలో చాలా వినాశకాలు జరుగుతాయి, విపరీతమైన ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి
  • క్యాన్సర్‌కి మందును కనుక్కుంటారు

ఎవరీ వాంగ బాబా…?

బల్గేరియాలోని పెట్రిచ్‌లో 1911, జనవరి 31న బాబా వాంగ జన్మించారు. ఈమె 1996 ఆగస్టు 11న మరణించారు. 12 ఏళ్ల వయసులో ఓ టోర్నడోలో కొట్టుకుపోయినా, ప్రాణాలతో వాంగ బయటపడ్డారు. బాబా వాంగ కళ్లలో ఇసుక పడటంతో చూపు కోల్పోయారు. ఈమె తన 16వ ఏట నుంచే భవిష్యవాణి మొదలుపెట్టారు. ఇదెలా ప్రారంభం అయిందంటే.. ఆమె తండ్రి పెంచుతున్న గొర్రెల మంద నుంచి ఓ గొర్రెను దొంగలు ఎత్తుకెళ్ళారు. దీంతో ఎత్తుకెళ్లిన చోటును వివరాలతో సహా ఊహించి చెప్పారు వాంగ. ఆ తరువాత 30 ఏళ్ల నాటికి ఆమె అతీంద్రియ శక్తులు మరింత బలమైనవిగా మారాయి. బల్గేరియా వాసులు ఆమె మాటలను నమ్మారు. ఆమె చెప్పిన ఎన్నో జోస్యాలు నిజం కావడంతో వాంగను ‘నోస్ట్రడామస్‌ ఆఫ్‌ ద బాల్కన్స్‌’గా జనం పిలిచుకునే వారు. జర్మనీ నియంత హిట్లర్‌ సైతం ఓసారి పన్డేవాను పిలిచారనే ప్రచారం ఉంది. దీంతో ఆందోళనతో ఆమె ఇల్లు విడిచి వెళ్లిపోయారనే చర్చప్రజల్లో జరిగింది.

రెండో ప్రపంచయుద్ధంతో పాటు కొన్ని సంఘటనలను ముందే ఊహించారు పన్దేవా. ఆమె ఊహించిన చెప్పిన జోస్యాల్లో 68 శాతం వరకూ నిజమయ్యాయనే వాదన ఉంది. అమెరికాలోని ట్విన్‌ ట్వవర్స్‌ను విమానాలతో కూల్చేస్తారని 1989లోనే వాంత చెప్పారు. అదేవిధంగా.. 2016లో యూరప్‌ పై ముస్లింలు దాడి.. ఇది యుద్ధానికి దారి తీసి చాలా మంది మృత్యువాత పడతారని 996కు ముందే వాంగ జోస్యం చెప్పారు. అలాగే సిరియాలో ‘గ్రేట్‌ ఇస్లామిక్‌ వార్‌’ మొదలై 2043 నాటికి రోమ్‌పై పూర్తి ఆధిపత్యం సాధిస్తుందని వెల్లడించిన వాంగ..2018 నాటికి అమెరికాను వెనక్కి నెట్టి చైనా శక్తివంతమైన దేశంగా అవతరిస్తుందని కూడా చెప్పారు.

బాబా వాంగ పన్డేవా చెప్పిన జోస్యాల్లో నిజమైనవి కొన్ని

  • అమెరికా అధ్యక్షుడు కెన్నడీ, భారత ప్రధానులు ఇందిర, రాజీవ్‌ హత్యల గురించి ప్రస్తావన
  • లోహ విహంగాల దాడితో అమెరికా సోదరులు (ట్విన్‌ టవర్స్‌) కూలుతారు
  • పొద(అప్పటి అధ్యక్షుడు ‘బుష్‌’ను ఉద్దేశించి)లో తోడేళ్లు అరుస్తాయి అమాయకుల రక్తం పారుతుంది’ 2001, సెప్టెంబరు 11న
  • ట్విన్‌టవర్స్‌ కూల్చివేత గురించి 1989లోనే చెప్పిన వాంగ
  • ఓ పెద్ద అల తీరాన్ని కమ్మేస్తుంది. గ్రామాలు, ప్రజలు జలసమాధి అవుతారు. 2004లో థాయిలాండ్ తీరంలో సునామీ గురించి జోస్యం చెప్పిన వాంగ
  • ఆగస్టు 1999 లేదా 2000లో కురుస్క్‌ నీటిలో మునిగిపోతుంది. ప్రపంచం కలవరానికి గురవుతుందని 1980లో చెప్పిన వాంగ.
  • 2000 ఆగస్టులో రష్యాకు చెందిన ‘కురుస్క్‌’ అణు జలాంతర్గామికి సముద్రంలో ప్రమాదం. వణికిపోయిన ప్రపంచదేశాలు బల్గేరియా రాజు బోరిస్‌-3 ఆగస్టు 28, 1943న చనిపోతారు.. 1944 ఆగస్టు 28న చనిపోయిన బోరిస్.

బాబా వాంగ పన్డేవా చెప్పిన మరికొన్ని భవిష్యత్ జోస్యాలు

  • 5079లో ఈ విశ్వం అంతమవుతుంది
  • 3797 నాటికి భూమిపై మనిషి జాతి ఉండదు
  • 2018లో శుక్రుడిపై కొత్త ఇంధనం కనుగొంటారు
  • ప్రపంచంలో మళ్లీ కమ్యూనిజం వ్యాప్తి చెందుతుంది
  • డొనాల్డ్ ట్రంప్ 2020లో మృత్యువు అంచుల దాకా వెళ్తారు. ఆమె చెప్పినట్లే ట్రంప్‌కి కరోనా వైరస్ సోకింది.
  • 2023లో భూమి కక్ష్య మారుతుంది. దీనివల్ల ధృవాల వద్ద మంచు కరిగి సముద్రాలు పొంగుతాయి.
  • సిరియాలో మొదలయ్యే ఇస్లామిక్‌ వార్‌ 2043లో రోమ్‌ను స్వాధీనం చేసుకోవడంతో ముగుస్తుంది. ఈ సందర్భంలో యూరప్ ప్రజలంతా మృత్యువాత పడతారు.
  • 2130లో నీటిలో నివసించేలా గ్రహాంతరవాసులు మనుషులకు సాయం చేస్తారు
  • 3005లో అంగారకుడిపై యుద్ధం జరుగుతుంది.
  • చంద్రుడిని తోకచుక్క ఢీకొంటుంది. భూమి చుట్టూ రాళ్లు, బూడిద వలయం ఏర్పడుతుంది

వాంగ బాబా చెప్పిన విషయాలు రాతపూర్వకంగా లేవు. ఆమె చెప్పిన వాటిలో చాలా వరకూ కల్పించినవే అనే చర్చ కూడా ఎక్కువగానే ఉంది. ఏదైనా జరిగితే వాంగ ముందే చెప్పారని అసత్య ప్రచారం చేస్తున్నారనే వాదన కూడా కొంతమంది చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:  Bigg boss 5 Telugu: కంటెస్టెంట్స్‌ను ఆటపట్టించిన బిగ్ బాస్.. హౌస్‌లో విరబూసిన నవ్వులు

Gadget Guru: ఇది లేకుంటే మీ బ్యాంక్ ఖాతా గుల్లే.. ఇవి షేర్ చేయకుండా ఉంటె బెటర్..(వీడియో)

Sheena Bora Case: షీనా బోరా మర్డర్‌ కేసులో ఊహించని ట్విస్ట్‌.. CBIకి ఇంద్రాణి సంచలన లేఖ

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?