Telugu News » Spiritual » According to chanakya neeti laziness is enemy for young people in telugu
Chanakya Niti: ఈ లక్షణాలు యువత సక్సెస్ కు ప్రథమ శత్రువులంటున్న ఆచార్య చాణక్య
Surya Kala |
Updated on: Sep 18, 2022 | 5:54 PM
యువత సక్సెస్ ఫుల్ పర్సన్ కావాలంటే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని, లేకుంటే వర్తమానంతో పాటు భవిష్యత్తులో కూడా బ్యాలెన్స్ ఉండదని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు.
Sep 18, 2022 | 5:54 PM
మోసం చేయడం ద్వారా - ఆచార్య చాణక్యుడు ప్రకారం.. మోసం చేసి సంపాదించిన డబ్బు ఆ వ్యక్తి దగ్గర ఎప్పుడూ నిలబడదు. ఎంత ధనం, సిరి సంపదలున్నా అలాంటి వ్యక్తులను.. ఆ ఇంటి కుటుంబ సభ్యులను ఎవరూ గౌరవించరు
1 / 5
చాలా సార్లు.. ఎంత కష్టపడి పని చేసినా ఏ పనిలోనూ విజయం సాధించలేము. పని ఒత్తిడి ఉంటే.. మనకు ఇష్టమైన వారిని కూడా దూరంగా ఉంచుతాం. అయితే ఎంత కష్టపడినా జీవితంలో మనం ఏమీ సాధించలేకపోతున్నాం అనుకునేవారు ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. కొన్ని జంతువుల లక్షణాల నుంచి నేర్చుకోవడం ద్వారా.. వ్యక్తి జీవితంలో విజయం సాధించగలడు.
2 / 5
మనస్సులో మోసం ఉన్న వ్యక్తి - తన మాటలను ఇతరులతో ఎప్పుడూ పంచుకోని వ్యక్తిని దూరం ఉంచండి. మీరు నష్టపోతుంటే.. వారు మనసులో సంతోషపడుతుంటారు. మీకు జరిగిన చెడును చూసి సంతోషిస్తారు. బహిర్గతంగా వ్యక్తం చేయకపోయినా లోలోపల సంతోషిస్తారు. మనసుని మోసంతో నింపేసుకుంటారు.
3 / 5
చెడు చేసే వారు - ఆచార్య చాణక్యుడు ప్రకారం మీ వెనుక చెడు చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇతరులకు మీ ముందు చెడు చేసే వ్యక్తి .. రేపు మీకు ఖచ్చితంగా చెడు చేస్తాడు.
4 / 5
అసూయ: కోపంలా అసూయ కూడా మనిషికి అతి పెద్ద శత్రువు అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అసూయ మనిషిని ముందుకు సాగనివ్వదు. అసూయపడే వ్యక్తి ఎప్పుడూ తనతో పాటు, ఇతరుల విజయానికి కూడా అడ్డుగా ఉంటాడు.