AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhogi Danda: కోనసీమలో ఘనంగా భోగి సంబరాలు.. 500 మీ. పొడవున్న భోగి దండతో ర్యాలీ

భోగి సంబరాలను చూడాలంటే గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిందే.. ఏ గ్రామంలోని మారు మూల వీధుల్లో చూసినా భోగిమంటలు దర్శనం ఇస్తాయి. కొత్త బట్టల్లో పిల్లల సంతోషం అడుగడుగునా దర్శనం ఇస్తుంది. కోనసీమ జిల్లాలో భోగి సంబరాలు సంబరాలు అంబరాలను తాకాయి. జిల్లా ముఖ్య పట్టణం అమలాపురంలోని గారపాటి వారి వీధిలో భారీ భోగి దండ తో గ్రామస్తులు భోగి సంబరాలను జరుపుకున్నారు. భోగి పండుగ రోజు అందరినీ భారీ దండ ఆకట్టుకుంటుంది.

Bhogi Danda: కోనసీమలో ఘనంగా భోగి సంబరాలు.. 500 మీ. పొడవున్న భోగి దండతో ర్యాలీ
Largest Bhogi Danda
Pvv Satyanarayana
| Edited By: Surya Kala|

Updated on: Jan 14, 2024 | 12:36 PM

Share

హిందువులు జరుపుకునే పెద్ద పండగల్లో ఒకటి సంక్రాంతి. ఈ పర్వదినాన్ని మూడు రోజుల పాటు తెలుగువారు ఘనంగా జరుపుకుంటారు.  మొదటి రోజు జరిగే భోగి పండుగ ఒక స్పెషల్. పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడా పిల్లలుగా మారిపోతారు. భోగి మంటలు వేసి సందడి చేస్తారు. సూర్యోదయాన్ని ముందే అభ్యంగ స్నానం చేసి.. ఆవు పేడతో చేసే భోగి పిడకలను పిల్లతో భోగి మంటల్లో వేయించి అగ్ని దేవుడికి నమస్కారం చేసి భోగి పండగను మొదలు పెడతారు. ముఖ్యంగా భోగి సంబరాలను చూడాలంటే గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిందే..

ఏ గ్రామంలోని మారు మూల వీధుల్లో చూసినా భోగిమంటలు దర్శనం ఇస్తాయి. కొత్త బట్టల్లో పిల్లల సంతోషం అడుగడుగునా దర్శనం ఇస్తుంది. కోనసీమ జిల్లాలో భోగి సంబరాలు సంబరాలు అంబరాలను తాకాయి. జిల్లా ముఖ్య పట్టణం అమలాపురంలోని గారపాటి వారి వీధిలో భారీ భోగి దండ తో గ్రామస్తులు భోగి సంబరాలను జరుపుకున్నారు. భోగి పండుగ రోజు అందరినీ భారీ దండ ఆకట్టుకుంటుంది. సుమారు 500 మీటర్లు పొడవున్న ఈ బోగి దండ కోసం దాదాపు 15 వందల భోగి పిడకలను వినియోగించారు. ఈ భారీ భోగి దండ వీధి వీధి అంతా కలిపి మోసుకొని వచ్చి భోగిమంటల్లో వేశారు. ఈ భోగి దండన తయారు చేసేందుకు సుమారు నెలరోజులపాటు సమయం పట్టింది అంటున్నారు గారపాటి వారి వీధి గ్రామస్తులు. సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉండేందుకే అందరూ ఏకమై ఇంత భారీ భోగి దండం తయారు చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ భారీ బోగి దండ జిలాల్లో చర్చనీయాంశంగా మారింది.

అమలాపురంలో ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డ కుటుంబీకులంతా స్వగ్రామంలో భోగి సంక్రాంతి వేడుకలు ఘనంగా చేసుకుంటున్నారు. స్థానిక పారిశ్రామిక వేత్త నందెపు వెంకటేశ్వర రావు నివాసంలో గంగిరెద్దులు, హరిదాసులు ఎడ్లబండ్లు తెలుగుదనం ఉట్టిపడేలా ఏర్పాటు చేశారు. సంక్రాంతి వేడుకల కోసం కుటుంబ సభ్యులంతా ఒకే చోటు చేరుకున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి కోడిపందాలు ఆడారు. మహిళలు కుటుంబ సభ్యులు ఏకమై డింకి పందెం ఆడుతూ పండుగ మొదటి రోజు భోగితో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. ఆచారంగా వస్తున్న కత్తి సాము చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!