షోలో కన్నీటి పర్యంతమైన సోనూ సూద్
కరోనా నేపథ్యంలో మొత్తం అన్ని సినిమా, సీరియల్స్, షోల షూటింగులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా సడలింపులు లభించడంతో ఈ మధ్యే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని షూటింగ్స్ ప్రారంభమయ్యాయి.

Sonu Sood Gets Emotional : కరోనా నేపథ్యంలో మొత్తం అన్ని సినిమా, సీరియల్స్, షోల షూటింగులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా సడలింపులు లభించడంతో ఈ మధ్యే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో దాదాపు 120 రోజుల విరామం తర్వాత ‘కపిల్ శర్మ షో..పునఃప్రారంభమైంది.
లాక్ డౌన్ అనంతరం మొదటి ఎపిసోడ్ ఆగష్టు 1 రాత్రి 9:30 గంటలకు ప్రసారం అయింది. ఈ ఎపిసోడ్ కు అతిథిగా ప్రముఖ నటుడు సోనూ సూద్ వచ్చారు. ప్రొమోతోనే ఆసక్తిరేపిన ఈ ఎపిపోడ్..ప్రసార సమయంలో భారీ రేటింగ్ సంపాదించింది. ఇక షో మధ్యలో వలస కూలీలతో వీడియో కాల్లో మాట్లాడిన సోనూ..వారి మాటలకు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా కపిల్ శర్మ సోనూ ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. సోనూ సూద్‌ను ‘ది రియల్ హీరో ఆఫ్ 2020’గా పేర్కొన్నారు.సోనూ పాజీతో తీసిన ఈ ఎపిసోడ్.. అన్నింటికన్నా ప్రత్యేకమైనదని కపిల్ తెలిపారు.
ఇక సోనూ సూద్..రియల్ హీరో అని ప్రపంచ అంతా కీర్తిస్తోన్న విషయం తెలిసిందే. కష్టం అని తెలిస్తే చాలు..ఆయన ఎగబడి వెళ్లిపోతున్నారు. వివిధ ఇబ్బందులతో సోషల్ మీడియాలో తనను సాయం అభ్యర్థిస్తోన్న వారికి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు సొంతూర్లకు వెళ్లడానికి చాలా హెల్ప్ చేశారు సోనూ సూద్.
Read More : ఏపీలోని కొవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న బెడ్లు, వెంటిలేటర్ల వివరాలు