బిగ్‌బాస్‌కు నో చెప్పిన పూన‌మ్

తెలుగు రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ షో నాలుగ‌వ సీజ‌న్ కు ఏర్పాట్లు చాలా వేగంగా జ‌రుగుతున్నాయి. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని షోను ప్రారంభంచ‌నున్నారు నిర్వాహ‌కులు.

బిగ్‌బాస్‌కు నో చెప్పిన పూన‌మ్

Bigg Boss 4 Telugu : తెలుగు రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ నాలుగ‌వ సీజ‌న్ కు ఏర్పాట్లు చాలా వేగంగా జ‌రుగుతున్నాయి. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని షోను ప్రారంభించ‌నున్నారు నిర్వాహ‌కులు. ఇప్ప‌టికే హోస్ట్ నాగార్జున ప్రోమో షూటింగులో పాల్గొన్నారు. ‌ అన్నపూర్ణ స్లూడియోలో చిత్రీక‌ర‌ణ జ‌రిపారు. ఈ నేప‌థ్యంలో, షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరనే విష‌యంపై ఆస‌క్తి నెల‌కుంది. ఇప్పుడు ప‌లువు‌రి పేర్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్నాయి.

హీరో‌ తరుణ్‌, న‌టి శ్రద్ధాదాస్‌, హంసానందిని, యూట్యూబ‌ర్ సున‌య‌న, యాంక‌ర్ విష్టు ప్రియ పేర్లు వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఇప్ప‌టికే తరుణ్‌, శ్రద్ధాదాస్‌ తాము షోలో పాల్గొన‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ షో నిర్వాహకులు హీరోయిన్ పూనమ్ కౌర్ సంప్రదించిన‌ట్లు వార్త‌లు వినిపించాయి. ఈ న‌టిని ఎక్కువ‌గా వివాదాలు చుట్టుముడుతుంటాయి. అంతేకాదు ట్విట్ట‌ర్ లో ఆమె చేసే ట్వీట్లు కూడా పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీస్తాయి. అందుకే పూనమ్‌ అయితే మంచి బ‌జ్ ఉంటుంద‌ని, నిర్వాహకులు ఆమెను అప్రోచ్ అయ్యార‌ట‌. భారీ పారితోష‌కం కూడా ఆఫ‌ర్ చేశార‌ట‌. అయితే ఈ ఆఫర్‌కు ఆమె తిరస్కరించినట్లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

 

Also Read : షోలో కన్నీటి పర్యంతమైన సోనూ సూద్