‘క్యాస్టింగ్ కౌచ్’పై నటి ప్రగతి సంచలన కామెంట్స్..
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ప్రగతి కూడా ఒకరు. చాలా మంది హీరో, హీరోయిన్లకు తల్లిగా.. వదినగా.. అత్తగా చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇక ఇప్పటికీ పరిమితం కావడంతో ఈమె రోజుకో వర్కౌట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ వార్తల్లో..

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ప్రగతి కూడా ఒకరు. చాలా మంది హీరో, హీరోయిన్లకు తల్లిగా.. వదినగా.. అత్తగా చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇక ఇప్పటికీ పరిమితం కావడంతో ఈమె రోజుకో వర్కౌట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది ప్రగతి. తాజాగా ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్‌పై పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టింది. ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఆమె పలు విషయాలు వెల్లడించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెద్ద హీరోయిన్స్ ఒక స్థాయికి వెళ్లిన తర్వాత ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది లేదనే చెబుతారు. ఎవరైతే సక్సెస్ కాలేదో వారి నుంచి మాత్రం క్యాస్టింగ్ కౌచ్ ఫిర్యాదులు వస్తాయి. ఇక ఇండస్ట్రీలో క్యాస్టింగ్ రెండు సందర్భాల్లో ఉంటుంది. ప్రస్తుతం అమ్మాయిల కోసమే సినిమాలు తీసే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఎక్కడైనా అందమైన అమ్మాయి ఉంటే వాళ్లతోనే సినిమాలు తీయడానికి దర్మక, నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపెడతారు అని వెల్లడించింది నటి ప్రగతి.
అలాగే క్యాస్టింగ్ కౌచ్ అనేది మన బిహేవియర్‌పై కూడా ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చింది. తనకు ఇలాంటి సంఘటనలు ఎదురైతే అక్కడి నుంచి వెళ్లిపోవడమో లేదా తప్పుకోవడమో చేస్తాను అని చెప్పుకొచ్చింది. నాకు కూడా ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. దీంతో పలు సినిమాల నుంచి నేను పక్కకు తప్పుకున్నా. ఇక క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రతీ ఇండస్ట్రీలో ఉంటుందని చెప్పుకొచ్చింది ప్రగతి.
Read More:
సీఎం జగన్‌కు చెన్నైవాసి అరుదైన కానుక.. బంగారు, వెండితో మసీదు!
‘ఆత్మ నిర్భర్ భారత్ లోగో’ తయారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!
ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు టీ షర్ట్స్, జీన్స్ ధరించడం నిషేధం!