సీఎం జ‌గ‌న్‌కు చెన్నైవాసి అరుదైన కానుక‌.. బంగారు, వెండితో మ‌సీదు!

ఆంధ్ర ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్‌కి ఓ చెన్నై వాసి అరుదైన కానుకను త్వ‌ర‌లోనే అందించ‌బోతున్నాడు. అది కూడా బంగారం, వెండితో మ‌సీదు న‌మూను గిఫ్టుగా ఇవ్వ‌బోతున్నాడు. బ‌క్రీదు పండుగ‌ను పుర‌స్క‌రించుకుని తిరుప‌త్తూరు జిల్లా అంబూరుకు చెందిన బంగారు త‌యారీ కార్మికుడు దేవ‌న్..

సీఎం జ‌గ‌న్‌కు చెన్నైవాసి అరుదైన కానుక‌.. బంగారు, వెండితో మ‌సీదు!

ఆంధ్ర ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్‌కి ఓ చెన్నై వాసి అరుదైన కానుకను త్వ‌ర‌లోనే అందించ‌బోతున్నాడు. అది కూడా బంగారం, వెండితో మ‌సీదు త‌యారు చేసిన‌ న‌మూను గిఫ్టుగా ఇవ్వ‌బోతున్నాడు. బ‌క్రీదు పండుగ‌ను పుర‌స్క‌రించుకుని తిరుప‌త్తూరు జిల్లా అంబూరుకు చెందిన బంగారు త‌యారీ కార్మికుడు దేవ‌న్… బంగారం, వెండితో మ‌సీదు న‌మూనాను త‌యారు చేశాడు. 35 గ్రాముల వెండి, 6.5 గ్రాముల బంగారంతో ఐదున్న‌ర ఇంచుల ఎత్తుతో ఒక రోజులోనే దీన్ని తయారు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇప్ప‌టికే పొంగ‌ల్ కుండ బంగారంతో చేసిన‌ట్లు తెలిపాడు. త్వ‌ర‌లోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ్యాప్‌ను బంగారంతో చేసి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కి అంద‌జేయనున్న‌ట్లు బంగారు త‌యారీ కార్మికుడు దేవ‌న్‌ వెల్ల‌డించాడు.

Read More:

ప్ర‌పంచ వ్యాప్తంగా టెర్ర‌ర్ సృష్టిస్తున్న కోవిడ్‌ మ‌హ‌మ్మారి

 ‘ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లోగో’ త‌యారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!

ఇక‌పై ప్ర‌భుత్వ ఉద్యోగులు టీ ష‌ర్ట్స్‌, జీన్స్ ధ‌రించ‌డం నిషేధం!

Click on your DTH Provider to Add TV9 Telugu