వంటల ఛానల్ పెట్టేసిన కంచె హీరోయిన్

కొత్త ఆలోచనకు తెరలేపింది. కరోనా ఆంక్షలను సడలించడంతో సముద్ర తీరంలో ఫోటో షూట్ నిర్వహించింది ప్రగ్యా జైస్వాల్. తన హాట్.. హాట్ ఫోటోలతో ఇన్స్టాగ్రామ్‌ను..

వంటల ఛానల్ పెట్టేసిన కంచె హీరోయిన్

కంచె సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన జబల్ పూర్ బ్యూటీ ఇప్పుడు కొత్త రూట్ ఎంచుకుంది. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ చిన్నది. ఓ కొత్త ఆలోచనకు తెరలేపింది. కరోనా ఆంక్షలను సడలించడంతో సముద్ర తీరంలో ఫోటో షూట్ నిర్వహించింది ప్రగ్యా జైస్వాల్. తన హాట్.. హాట్ ఫోటోలతో ఇన్స్టాగ్రామ్‌ను నింపిచేసింది. దీంతో ఈ మధ్యప్రదేశ్ అందాల సుందరి ఇన్ట్సాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది.

దీంతో తన ప్లాన్ ఆఫ్ యాక్సన్‌ను మొదలు పెట్టింది. అంతే కాదు తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందు కోసం యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది. ఈ ఛానల్ ద్వారా తనకు ఇష్టమైన వెరైటీ వంటలను అభిమానులకు రుచి చూపిస్తోంది. తన మొదటి ఎప్సోడ్‌లో జపనీస్ చీస్ కేక్‌ను తయారు చేసి చూపించింది. ఈ వీడియోను పోస్ట్ చేసిందో లేదో అంతే.. పెద్ద ఎత్తున ట్రాఫిక్ వస్తోంది.

Click on your DTH Provider to Add TV9 Telugu