Telangana: మద్యం ప్రియులకు బిగ్ అలర్ట్ .. త్వరలో పెరగనున్న ధరలు! ఎంతంటే?
రాష్ట్రంలోని మద్యం ప్రియులకు ఇదో బ్యాడ్ న్యూస్ అనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే త్వరలో తెలంగాణ వ్యాప్తంగా మద్యం ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మద్యం ధరల సవరణ అంశంపై ధరల నిర్ణయ కమిటీ త్వరలోనే భేటీ అయి ధరల పెంపు, కొత్త ధరల అమలు, కొత్త బాటిల్స్ ప్రవేశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

తెలంగాణలోని మద్యం ప్రియులకు ఇదో బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తయారీ ఖర్చులు పెరిగిపోయాయని, ధరలను సవరించాలని ఇప్పటికే పలుమార్లు మద్యం తయారీ సంస్థలు ప్రభుత్వాన్ని కోరగా.. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ధరల నిర్ణయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జూలై 17వ తేదీన సమావేశమై రాష్ట్రంలో మద్యం ధరల పెంపు, కొత్త ధరల అమలు, బాటిళ్ల సైజులో మార్పులు వంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే దీనిపై అటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
అయితే ప్రభుత్వం ఒక్కసారిగా ధరలను పెంచేయదు. అన్ని వర్గాల నుంచి సమాచారం తీసుకున్న తర్వాతే ధరల సవరణపై ఓ అభిప్రాయానికి వస్తుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల నిర్ణయ కమిటీ.. మద్యం తయారీ సంస్థలు, డిస్టిలరీలు, పరిశ్రమల సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపింది. పన్నులు, ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు బాగా పెరిగిపోయాయని.. తద్వారా ప్రస్తుతం విక్రయిస్తున్న ధరలతో వ్యాపారం కొనసాగించడం కష్టంగా ఉందని తయారీ సంస్థలు కమిటీకి చెప్పినట్టు తెలుస్తోంది. కాబట్టి కమిటీ వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
కాబట్టి ఈ నెల 17న సమావేశం అయ్యే కమిటీ.. మద్యం ధరలను ఎంతవరకు పెంచాలి, ఏయే బ్రాండ్ల ధరలు పెంచాలి, పెరిగే ధరలను ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురావాలి, అలాగే కొత్తగా మద్యం సీసాల్లో మార్పులు ఏమైనా తీసుకురావాలా అనే అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అంటే ఇప్పుడున్న పాత బాటిళ్లతో పాటు కొత్తగా 150ML సైజు బాటిల్స్ కూడా తెచ్చేందుకు తయారీ సంస్థలు కమిటీ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కాబట్టి వీటిపై కూడా కమిటీ నిర్ణయం తీసుకోనుంది. అయితే కొన్ని నివేదికల ప్రకారం.. మద్యం ధరలను 10 నుంచి 20 శాతం వరకు పెంచే ఆలోచనలో కమిటీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై కూడా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
