AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk song: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. ఒక్కసారి వింటే వదిలిపెట్టారు

సినిమా పాటలు ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే జానపదగీతాలకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతుంటారు. జానపదగీతాలు ఎప్పుడూ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. ఎన్నో ఫోక్ సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Folk song: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. ఒక్కసారి వింటే వదిలిపెట్టారు
Song
Rajeev Rayala
|

Updated on: Oct 18, 2026 | 9:04 PM

Share

తెలంగాణ జానపద గీతాలకు సోషల్ మీడియాలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. పల్లె పదాలు, స్థానిక యాస, సంప్రదాయ సంగీతం కలగలిసిన ఫోక్ సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, పండుగలు, జానపద సంప్రదాయాలను ప్రతిబింబించే పాటలు యూట్యూబ్‌లో భారీ వ్యూస్ సాధిస్తూ సత్తా చాటుతున్నాయి. కేవలం తెలంగాణలోనే కాకుండా ఇతర ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ ఈ పాటలకు అభిమానులు పెరుగుతున్నారు. ఇక ఇప్పుడు ఓ ఫోక్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. అంతే కాదు ఈ సాంగ్ మిలియన్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే సాంగ్ వినిపిస్తుంది. ఆ ఫోక్ సాంగ్ లో కనిపించింది ఎవరో కాదు తెలంగాణ అందాల బొమ్మ నాగ దుర్గ.  ఇటీవలే హీరోయిన్ గా మారిన ఆమె వరుసగా సినిమాలు చేస్తుంది.

అందం, అభినయంతో పాటు తనదైన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది నాగ దుర్గ. తెలంగాణ జానపద పాటల్లో కనిపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోంది. ఆమె నటించిన పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తుండటంతో ఫోక్ సాంగ్స్ అభిమానుల్లోనూ ఆమె పేరు వినిపిస్తోంది. పాటల్లో నటించడమే కాకుండా వివిధ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన అనుభవాలను, ఆసక్తికర విషయాలను పంచుకుంటోంది ఈ ఫోక్ డాన్సర్. ఇక ఇప్పుడు వైరల్ అవుతున్న సాంగ్ మరేదో కాదు.. నా పేరే ఎల్లమ్మ.. నేను జోగురాలమ్మ. అద్భుతమైన పదాలతో సాగిపోయే ఈ పాట తెలంగాణ జానపద శైలిని, ఎల్లమ్మ తల్లి ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. ఈ పాటలో భాగం కావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నాగ దుర్గ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ అవకాశాన్ని అదృష్టంగా భావించిన ఆమె, పాటలో నటించడం తనకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని తెలిపింది.

‘నా పేరే ఎల్లమ్మ’ పాటకు యూట్యూబ్‌లో విశేష స్పందన లభించింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ పాట 102 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ బోనాల పండుగ నేపథ్యంలో రూపొందిన ఈ పాటకు జానపద సంగీతాన్ని ఇష్టపడే వారితో పాటు తెలంగాణ సంస్కృతిపై ఆసక్తి ఉన్న ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ లభించింది. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఈ సాంగ్ పై మీరూ ఒలుక్కెయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us