Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నమ్మ శశికళ ఆదివారం డిశ్చార్జ్, నాలుగేళ్ల కారాగారం.. వారం రోజులుగా ఆసుపత్రి గోడల మధ్య కాలం వెళ్ల దీసి బయటకు

అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ ఆదివారం బెంగళూరు విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె రోగ్యం కుదుటపడినప్పటికి...

చిన్నమ్మ శశికళ ఆదివారం డిశ్చార్జ్,  నాలుగేళ్ల కారాగారం.. వారం రోజులుగా ఆసుపత్రి గోడల మధ్య కాలం వెళ్ల దీసి బయటకు
Follow us
Venkata Narayana

|

Updated on: Jan 30, 2021 | 10:30 PM

అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ ఆదివారం బెంగళూరు విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె రోగ్యం కుదుటపడినప్పటికి…మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో బెంగుళూరులోనే ఉండాలని నిర్ణయించుకున్నారు శశికళ. ఫిబ్రవరి మొదటి వారంలో శశికళ చెన్నై వెళ్లే అవకాశం కనిపిస్తోంది. నాలుగేళ్ల జైలుశిక్షాకాలం పూర్తైన సమయంలో కరోనా కారణంగా బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చేరారు చిన్నమ్మ. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు.

జయలలిత మరణానంతరం శశికళ జయలలిత నివాసం పోయెస్ గార్డెన్‌లోనే ఉండేవారు. కానీ ఆమె జైలుకెళ్లిన తర్వాత పోయెస్ గార్డెన్‌ను తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దాంతో ఆమె విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవగానే ఎక్కడికి వెళ్తారనేది సస్పెన్స్‌గా మారింది. అయితే చిన్నమ్మ కోసం ఆమె మేనల్లుడు ఇప్పటికే ఓ అపార్ట్‌మెంట్‌ను సిద్ధం చేశారని, శశికళకు కావల్సిన అన్ని ఏర్పాట్లూ అక్కడే అరేంజ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు శశికళ ఫ్యూచర్ పాలిటిక్స్‌పై కూడా రకరాకల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.

2021 మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపధ్యంలో తమిళ రాజకీయాల్లో చిన్నమ్మ రీ ఎంట్రీ ఉంటుందా ? లేదా ? అనే చర్చ జరుగుతోంది. అయితే ఆమె వెంటనే పాలిటిక్స్‌లోకి అడుగుపెడితే అన్నాడీఎంకేలో చిన్నమ్మ వర్గానికి చెందిన MLAలు కొందరు AMMKలోకి వచ్చేస్తారని టాక్‌. AMMK అంటే అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం. దీన్ని స్థాపించింది, ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ మేనల్లుడు TTV దినకరన్‌. పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేసే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.