లింగాల కాలువను డిజైన్ చేసిన వివేకా
గుండెపోటుతో మాజీ మంత్రి, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి కన్నుమూశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ఇలా అన్ని పదవుల్లోనూ ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారు. రాజకీయాలకు అతీతంగా లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ప్రారంభించిన వివేకా.. ఆ క్లబ్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అంతేకాదు కడప జిల్లాలోని లింగాల కాలువను డిజైన్ చేశారు. ఆ కాలువ వలన చుట్టుపక్కల ఉన్న వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్‌లోని […]

గుండెపోటుతో మాజీ మంత్రి, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి కన్నుమూశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ఇలా అన్ని పదవుల్లోనూ ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారు. రాజకీయాలకు అతీతంగా లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ప్రారంభించిన వివేకా.. ఆ క్లబ్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అంతేకాదు కడప జిల్లాలోని లింగాల కాలువను డిజైన్ చేశారు. ఆ కాలువ వలన చుట్టుపక్కల ఉన్న వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జగన్ నివాసంలో ఉన్న వివేకా బుధవారం కడపజిల్లాకు వెళ్లారు. గురువారం పులివెందుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అర్ధరాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.



