AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: నాకు స్టార్ డమ్ తెచ్చిన సినిమా అదే.. నన్ను చాలా మార్చేసింది.. మహేష్ బాబు కామెంట్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ టార్గెట్ గా పెట్టుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో మహేష్ రేంజ్ ప్రపంచ స్థాయికి వెళ్లడం గ్యారెంటీ అని తెలుస్తోంది.

Mahesh Babu: నాకు స్టార్ డమ్ తెచ్చిన సినిమా అదే.. నన్ను చాలా మార్చేసింది.. మహేష్ బాబు కామెంట్స్..
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Feb 04, 2026 | 2:49 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. గుంటూరు కారం సినిమాతో హిట్టు అందుకున్న ఆయన.. ప్రస్తుతం వారణాసి చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్, జక్కన్న కాంబోలో వస్తున్న సినిమా కావడంపై వారణాసి కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక గతేడాది నవంబర్ లో ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇందులో మహేష్ లుక్స్, మేనరిజం అన్ని కోత్తగా ఉండబోతున్నాయని ఇదివరకే జక్కన్న చెప్పుకొచ్చాడు. ఇక హాలీవుడ్ లో ఇదివరకే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు రాజమౌళి. వారణాసి గ్లింప్స్ రిలీజ్ అయిన సమయంలో రాజమౌళి, మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ హాలీవుడ్ లో స్పెషల్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు.

ఎక్కువ మంది చదివినవి: Dhandoraa Movie : దండోరా సినిమాలో బింధు మాధవి పాత్రలో ఆ హీరోయిన్ నటించాల్సింది.. కానీ.. డైరెక్టర్

ఇప్పుడు ఆ వీడియోలను రిలీజ్ చేశారు. హాలీవుడ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ వారణాసి సినిమాతోపాటు తన కెరీర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే పోకిరి మూవీ గురించి మాట్లాడారు. వారణాసి సినిమాకు ముందు మీ లైఫ్ మార్చిన సినిమా ఏదని అడగ్గా.. మహేష్ స్పందిస్తూ.. “నేను కేవలం 29 సినిమాలు మాత్రమే చేశాను. కానీ 25 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాను. చైల్డ్ ఆర్టిస్టుగా కొన్ని చిత్రాలు చేశాను. కానీ నన్ను స్టార్ గా నిలిపిన సినిమా పోకిరి. ఆ మూవీ నన్ను చాలా మార్చేసింది. 2006లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్ సైతం స్టార్ట్ అయ్యింది. ఫ్యాన్స్ అంచనాలు పెరిగిపోయాయి. అంత పెద్ద హిట్టు వచ్చినా నేను కన్ఫ్యూజన్ లో పడ్డాను. ప్రతి సినిమా మనిషిగా నన్ను ఎంతో కొంత మార్చింది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి: Cinema : అర్థరాత్రి హోటల్లో అరుపులు.. 24 ఏళ్లుగా ఆ హీ‏రోయిన్‏ను భయపెడుతున్న సినిమా.. ఇప్పటికీ..

మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రానికి డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఇలియానా కథానాయికగా నటించగా.. ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో దాదాపు రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

ఎక్కువ మంది చదివినవి: Jabardasth: పెద్ద హీరో సినిమాలో ఛాన్స్.. మొహం మీదే వద్దని చెప్పా.. జబర్దస్త్ బ్యూటీ..

Follow Us